సోమవారం 30 నవంబర్ 2020
Hyderabad - Oct 31, 2020 , 06:13:03

నేడు పలు ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం

నేడు పలు ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్‌ :  గ్రేటర్‌ ప్రజల దాహార్తిని తీర్చడంలో ముఖ్యభూమిక పోశిస్తున్న కృష్ణా ఫేజ్‌-2 పథకంలోని 1400 ఎంఎం డయా మెయిన్‌ రింగ్‌-1 పైపులైన్‌కు జంక్షన్‌ పనులు చేపడుతున్న సందర్భంగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు నీటి సరఫరాకు అంతరాయం కలుగతుందని అధికారులు తెలిపారు. మెహిదీపట్నం, కార్వాన్‌, లంగర్‌హౌస్‌, కాకతీయనగర్‌, హుమాయున్‌నగర్‌, తల్లాగడ్డ, అసిఫ్‌నగర్‌, ఎంఈఎస్‌, షేక్‌పేట, ఓయూ కాలనీ, టౌలిచౌకి, మల్లేపల్లి, విజయ్‌నగర్‌ కాలనీ, భోజగుట్ట, జియాగూడ, రెడ్‌హిల్స్‌, సచివాలయం, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌, అల్లాబండ, గగన్‌మహల్‌, హిమాయత్‌నగర్‌, బుద్వేల్‌, హైదర్‌గూడ, రాజేంద్రనగర్‌, ఉప్పర్‌పల్లి, సులేమాన్‌ నగర్‌,  ఎంఎం పహాడి, అత్తాపూర్‌, చింతల్‌ మెట్‌, కిషన్‌బాగ్‌, గంధంగూడ, కిస్మత్‌పురా ప్రాంతాలలో నీటి సరఫరా ఉండదని తెలిపారు.