సోమవారం 13 జూలై 2020
Hyderabad - Jun 01, 2020 , 01:25:18

‘సీజనల్‌' నివారణే లక్ష్యంగా వ్యర్థంపై యుద్ధం

‘సీజనల్‌' నివారణే లక్ష్యంగా వ్యర్థంపై యుద్ధం

హైదరాబాద్ : సీజనల్‌ వ్యాధులపై బల్దియా యుద్ధం ప్రకటించింది. ఈ మేరకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందులో   భాగంగా సోమవారం నుంచి 8వ తేదీ వరకు 150 డివిజన్లలో  పారిశుధ్య డ్రైవ్‌ చేపట్టనున్నది. వివిధ విభాగాలకు చెందిన సిబ్బందిని సేవలకు వినియోగించనున్నది.  20,667 మంది పారిశుధ్య కార్మికులు, 21,869 సిబ్బందితో పాటు 2375 ఎంటమాలజీ వర్కర్లు ఈ డ్రైవ్‌లో పాల్గొననున్నారు.  30 మంది డిప్యూటీ కమిషనర్లు, ఆరుగురు జోనల్‌ కమిషనర్ల్లు నిరంతరం పరిశీలించనున్నారు.  27 మంది డీఈలు, 16 మంది ఏఎంవోహెచ్‌ల పర్యవేక్షణలో పారిశుధ్య కార్యక్రమాలు, 28 ఏఈలు, ఐదుగురు ఎస్‌ఈలు, ఒక సీఈ పర్యవేక్షణలో ఎంటమాలజీ కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నారు. డెంగీ, మలేరియా వంటి వ్యాధులను నివారించేందుకు చర్యలు తీసుకుంటారు. 

వార్డుల వారీగా... 

పారిశుధ్య డ్రైవ్‌లో వివిధ పనులు చేపట్టేందుకు అధికారులు వార్డుల వారీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఖాళీ స్థలాల్లో  వ్యర్థాలు లేకుండా చూడడం, రోడ్ల వెంట పడేసిన చెత్తాచెదారాన్ని తొలిగించడం, నిల్వ నీరు తొలిగింపు, నాలాల్లో పూడికతీత పనులు, భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు వంటివి చేస్తారు. 


logo