సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 01, 2020 , 23:46:41

డ్రోన్‌లతో దోమలపై యుద్ధం

డ్రోన్‌లతో దోమలపై యుద్ధం

విప్‌ అరెకపూడి గాంధీ

ఎల్లమ్మ చెరువులో దోమల మందు పిచికారీ

ప్రజలు వ్యాధుల బారిన పడకుండా చర్యలు

హైదర్‌నగర్‌ : వర్షాకాలం నేపథ్యంలో దోమల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని ప్రభుత్వ విప్‌ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. శేరిలింగంపల్లి నియోజవకర్గం ఆల్విన్‌ కాలనీ డివిజన్‌ పరిధిలోని ఎల్లమ్మ చెరువులో కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేశ్‌ గౌడ్‌తో కలిసి డ్రోన్‌ సాయంతో దోమల మందును విప్‌ గాంధీ బుధవారం పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని చెరువులన్నింటిలోనూ దోమల నివారణకు డ్రోన్‌లను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. దోమల వ్యాప్తిని అరికట్టడం ద్వారా సీజనల్‌ వ్యాధుల నుంచి ప్రజలను కాపాడుకునేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. జనావాసాల్లో దోమల నివారణకు పూర్తిస్థాయి చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మురుగు నీరు నిల్వలేకుండా జాగ్రత్తపడాలని విప్‌ గాంధీ సూచించారు. ఈ కార్యక్రమంలో జోన్‌ సీనియర్‌ ఎంటమాలజిస్ట్‌ లక్కీరెడ్డి, ఏఈ నగేశ్‌, నర్సింహ, గణేశ్‌, రాజుయాదవ్‌, సైదేశ్వర్‌రావు, కాశీనాథ్‌, రవీందర్‌, పద్మారావు, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.


logo