బుధవారం 02 డిసెంబర్ 2020
Hyderabad - Oct 04, 2020 , 06:50:10

హైస్కూల్‌ స్థాయి నుంచే వృత్తి విద్యాకోర్సులు

హైస్కూల్‌ స్థాయి నుంచే వృత్తి విద్యాకోర్సులు

సుల్తాన్‌బజార్‌ : హైస్కూల్‌ స్థాయి నుంచే వృత్తి విద్యా కోర్సులను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ.కిషన్‌రెడ్డి తెలిపారు. మల్లేపల్లి ప్రభుత్వ ఐటీఐ మోడల్‌ భవన ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, పశు పంవర్థశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాద్‌, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్‌ మెరాజ్‌ హుస్సేన్‌, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ  రాణి కుముదిని, రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ సంచాలకులు కేవై.నాయక్‌, జేడీ ఎస్‌వీకే నగేశ్‌,ఆర్‌డీడీ నర్సయ్య, ప్రిన్సిపాల్‌ రాధాకృష్ణమూర్తి, టీజీవో హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణాయాదవ్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం మోడల్‌ ఐటీఐ భవనంలో నిర్మించిన తరగతి గదులను, కాన్ఫరెన్స్‌హాల్‌ను సందర్శించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలోనే అతిపెద్దదైన మల్లేపల్లి ఐటీఐ భవనాన్ని మోడల్‌ ఐటీఐగా తీర్చిదిద్దే క్రమంలో కేంద్రం 70శాతం,రాష్ట్రం 30 శాతం నిధులతో ఆదర్శ ఐటీఐగా రూపుదిద్దుకోవడం అభినందనీయమన్నారు. ఇందులో భాగంగా రూ.2.96 కోట్లతో విశాలంగా మోడల్‌ ఐటీఐ భవనాన్ని నిర్మించుకొని ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. అనంతరం హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీలకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ మల్లేపల్లి ఐటీఐలో ఇప్పటికే 22కోర్సులు కొనసాగుతుండగా మరో ఆరు నూతన కోర్సులు ప్రవేశపెడుతూ ఆదర్శ ఐటీఐగా మార్పు చెందడంతో విదార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. అనంతరం  మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఎంతో పేరున్న మల్లేపల్లి ఐటీఐకి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్రఉపాధి శిక్షణ శాఖ ఉప సంచాలకులు రాజా, ఏవో చంద్ర శేఖర్‌, ఉద్యోగులు గిరిజా రాణి, అజయ్‌, సత్యనారాయణ, సుధాకర్‌రెడ్డి, ఖలీల్‌, పాషా, సుదర్శన్‌, రాఘవేందర్‌గౌడ్‌, శివనాయక్‌, జ్యోతి, శారద, విశ్వలత, పార్వతి, సిబ్బంది, బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.