శనివారం 05 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 07:36:01

సకల వసతులతో ‘వైకుంఠధామం’

సకల వసతులతో ‘వైకుంఠధామం’

అమీర్‌పేట్‌ : సకల వసతులతో బల్కంపేట వైకుంఠధామం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. వైకుంఠధామం తుది దశ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్మశానవాటికల్లో సహజంగా ఉండే వైరాగ్య వాతావరణానికి పూర్తి భిన్నంగా వైకుంఠధామం నిర్మించామన్నారు. 1.18 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న వైకుంఠధామంలో 6.5వేల చదరపు అడుగుల స్థలంలో శవదహనాల కోసం మూడు వేదికలు, వీక్షించేందుకు హాల్‌,  పూజాది కార్యక్రమాలు, దశదిన కర్మ క్రియల నిర్వహణకు హాళ్లు, అస్థికలను భద్రపరిచే గది, మరుగుదొడ్ల నిర్మాణాలతోపాటు స్నానపు గదులను నిర్మించినట్లు చెప్పారు.  దాదాపు 1200 మొక్కలు నాటినట్లు తెలిపారు. కనీస వసతులు లేని పరిస్థితుల నుంచి సకల వసతులతో కూడిన అధునాతన వ్యవస్థగా బల్కంపేట శ్మశానవాటికను తీర్చిదిద్దిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కార్‌కే దక్కుతుందన్నారు.