శుక్రవారం 07 ఆగస్టు 2020
Hyderabad - Jul 13, 2020 , 00:14:59

ఆత్మనిర్భర్‌ భారత్‌ను సద్వినియోగం చేసుకోండి

ఆత్మనిర్భర్‌ భారత్‌ను సద్వినియోగం చేసుకోండి

అంబర్‌పేట : చిరు వ్యాపారుల కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. నల్లకుంట డివిజన్‌, శంకరమఠం కూరగాయల మార్కెట్‌లో ఉండే చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున 20 మందికి మంజూరైన చెక్కులను ఆదివారం ఎమ్మెల్సీ రాంచందర్‌రావుతో కలిసి ఆయన అందజేశారు. సర్కిల్‌ డీసీ వేణుగోపాల్‌, డీపీవో రజిత,  ఉస్మాన్‌, శంకరమఠం కూరగాయల మార్కె ట్‌ కమిటీ అధ్యక్షుడు ఎం.మధుసూదన్‌యాదవ్‌ పాల్గొన్నారు. 


logo