మంగళవారం 07 జూలై 2020
Hyderabad - May 31, 2020 , 02:09:56

16 చోట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లకు శ్రీకారం.. తుది దశలో పనులు

16 చోట్ల అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లకు శ్రీకారం.. తుది దశలో పనులు

హైదరాబాద్  : పట్టణీకరణతో పెరుగుతున్న కాలుష్యం..మరోవైపు పని ఒత్తిడితో నగరవాసులకు ఎన్నో అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నుంచి  ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం ఉద్యానవనాలకు శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా హెచ్‌ఎండీఏ  పరిధిలో 16 చోట్ల భాగ్యనగర నందనవనం తరహాలో అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రంగారెడ్డి, యాదాద్రి, మెదక్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 5928.38 హెక్టార్లలో రూ.96.64కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులు చేపడుతున్నట్లు అర్బన్‌ ఫారెస్ట్రీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

ఎన్నో ప్రత్యేకతలు 

ఆహ్లాదానికి నిలయంగా మారనున్న అర్బన్‌ ఫారెస్ట్‌ బ్లాక్‌ల్లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పర్యాటకులు తమ పిల్లాపాపలతో  సేద తీరేలా ఈ ఉద్యానవనాలు అందంగా ముస్తాబవుతున్నాయి. వాకింగ్‌ పాత్‌వేలు, సైకిల్‌ ట్రాక్‌లు, పిల్లలు ఆడుకునే విధంగా చిల్డ్రన్‌ కార్నర్లు రానున్నాయి. యోగా సెంటర్లు, జనం కూర్చునేందుకు భారీ వృక్షాల కింద రచ్చబండలను కూడా ఏర్పాటు చేయనున్నారు.


logo