e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home హైదరాబాద్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సహకరిద్దాం: ఎమ్మెల్యే

స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సహకరిద్దాం: ఎమ్మెల్యే

స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సహకరిద్దాం: ఎమ్మెల్యే

కాప్రా, ఏప్రిల్‌ 13: చెత్తను సేకరించి, తరలించే సమయంలో ఆ చెత్త కిందపడకుండా కొత్తగా రూపొందించిన స్వచ్ఛ ఆటోలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా సర్కిల్‌ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ నుంచి సర్కిల్‌కు అందిన 20 స్వచ్ఛ ఆటోలను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, సర్కిల్‌ డిప్యూటీ కమిషనర్‌ ఎన్‌.శంకర్‌, వివిధ వార్డుల కార్పొరేటర్లు, అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొత్తగా వచ్చిన స్వచ్ఛ ఆటోలలో చెత్త తరలించే సమయంలో వ్యర్థాలు కిందపడకుండా రూపొందించారన్నారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు వీలుగా, దుర్వాసన బయటకు రాకుండా మూతలు వేసేవిధంగా తయారు చేశారన్నారు. డివిజన్‌కు నాలుగు చొప్పున కొత్త ఆటోల కేటాయింపు జరిగిందన్నారు. వీటిని సరైన పద్ధతిలో వినియోగించడం ద్వారా అన్ని కాలనీలను చెత్త రహిత కాలనీలుగా తీర్చిదిద్ది స్వచ్ఛ సర్వేక్షణ్‌ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. డీసీ శంకర్‌ మాట్లాడుతూ.. సర్కిల్‌ పరిధిలో ఉన్న డస్ట్‌బిన్‌లను తొలగించామనీ, కాలనీల నుంచి చెత్తను తరలించేందుకు ఇప్పటికే ఉన్న 98 స్వచ్ఛ ఆటోలకు అదనంగా 24 స్వచ్ఛ ఆటోలు వినియోగంలోకి రానున్నాయన్నారు. కాలనీలను పరిశుభ్రంగా , చెత్తరహితంగా ఉంచేందుకు కాలనీవాసులు సహకరించాలని కోరారు.

ఎమ్మెల్యేను కలిసిన నేతలు

ఉగాది పండుగ సందర్భంగా ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డిని మంగళవారం పలువురు నాయకులు కలిశారు. ఉగాది పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు అందజేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శ్రీ ప్లవ నామ సంవత్సరంలో సమస్యలు లేకుండా, ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం రవికుమార్‌, అరిటికాయల భాస్కర్‌, గరిక సుధాకర్‌, ముత్యంరెడ్డి, శివ, వినీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు సముద్రాల వేణుగోపాలచారిని మంగళవారం ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి కలిశారు. ఈమేరకు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేముల సంతోష్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రావు, యాదగిరిరెడ్డి, అన్య వెంకటేశ్‌, మస్కా సుధాకర్‌ సోమసాని ప్రవీణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

శివాలయంలో ఎమ్మెల్యే, కార్పొరేటర్‌ పూజలు

మల్లాపూర్‌, ఏప్రిల్‌ 13 : ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మల్లాపూర్‌లోని నందీశ్వర ఆలయంలో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్‌ పన్నాల దేవేందర్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు పాండుగౌడ్‌, నాగరాజు, సుదర్శన్‌, కృష్ణ, మహేందర్‌గౌడ్‌, డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి, హమాలీ శ్రీనన్న, నెమలి రవి, తండా వాసుదేవ్‌గౌడ్‌, ఉపేందర్‌రావు, కట్ట నాగరాజ్‌, శ్యాంసుందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సుందర్‌రెడ్డి, శ్రావణ్‌, తదితరులు పాల్గొన్నారు.

అగ్నిప్రమాదాల నివారణకు కృషి చేయాలి..

అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన పెంపొందించాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అన్నారు. అగ్నిప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన అండ్‌ అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏప్రిల్‌ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించే అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించి, ప్రసంగించారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు 101కి సమాచారం అందించాలన్నారు. ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అవగాహనతో కూడిన ఆచరణతోనే సమస్యలు పరిష్కరించుకోవచ్చని చెప్పారు.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులు అందజేత

హబ్సిగూడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి అందజేశారు. ఉప్పల్‌ డివిజన్‌ సెవెన్‌ హిల్స్‌కాలనీకి చెందిన భారతమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన రూ.20 వేల చెక్కును బాధితురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న వారిని సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో ఆదుకుంటున్నామన్నారు.

Advertisement
స్వచ్ఛ సర్వేక్షణ్‌కు సహకరిద్దాం: ఎమ్మెల్యే
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement