ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 24: ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ)లో పలు పరిపాలనాపరమైన పదవులను ఇఫ్లూ వీసీ, యూజీసీ సభ్యుడు ప్రొఫెసర్ ఇ. సురేశ్‌కుమార్ శనివారం భర్తీ చేశారు. ఇఫ్లూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ నియామకాలను చేపట్టినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇఫ్లూ ప్రొ-వైస్ చాన్స్‌లర్‌గా ప్రొఫెసర్ రేవతి శ్రీనివాస్, అకాడమిక్స్ డీన్‌గా ప్రొఫెసర్ టి. శాంసన్, ఇన్చార్జి రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్ కె. నరసింహారావు, ఓఎస్డీ టు వీసీగా ప్రొఫెసర్ సురభి భారతి, డిప్యూటీ డీన్లుగా డాక్టర్ రాజునాయక్, డాక్టర్ వెంకట్రావును నియమించారు. ఈ మేరకు వారికి ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ నియామకపత్రాలను అందజేశారు.