శుక్రవారం 04 డిసెంబర్ 2020
Hyderabad - Oct 27, 2020 , 08:52:19

రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు ...

 రైలు ఢీకొని గుర్తు తెలియని యువకుడు ...

కాచిగూడ : పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతుండగా.. రైలు ఢీకొని గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. ఈ  సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్‌ పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు వివరాల ప్రకారం... గుర్తుతెలియని వ్యక్తి(21) యాకత్‌పుర-ఉప్పుగూడ రైల్వేస్టేషన్‌ల మధ్య పట్టాల పక్కన నడుచుకుంటూ వెళుతున్నాడు. అదే సమయంలో ఎదురుగా వచ్చిన రైలు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే ఫోన్‌: 8143807592 లో సంప్రదించాలని కోరారు.