శుక్రవారం 05 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 01:33:01

వాహనంకు సైడ్‌ మిర్రర్‌ లేకపోతే.. జరిమానా

వాహనంకు సైడ్‌ మిర్రర్‌ లేకపోతే.. జరిమానా

హైదరాబాద్ : మీ వాహనం అద్దం....మీకు రక్షణ ఇస్తుం ది.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం బారిన పడేస్తుంది. ఈ క్రమంలోనే వాహనదారుడు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకు వాహనానికి అద్దం ఉండాల్సిందేనని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అంటున్నారు. అద్దం ఉంటే రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు మరో లేన్‌కు వెళ్లే సమయంలో లేదా రోడ్డుపై టర్నింగ్‌ తీసుకునే సమయం లో వెనకాల వచ్చే వాహనాలను గుర్తించి.. ఎలాంటి గందరగోళం లేకుండా సులభంగా ప్రయాణించవచ్చు. అదే అద్దం లేకపోతే వెనకాల నుంచే వాహనాలను గుర్తించలేం. 

దీంతో మీరు రోడ్డుపై ములుపులు తిప్పినా.. పక్క లేన్‌కు వెళ్తున్నా అకస్మాత్తుగా వెళ్లినా వెనకాల వచ్చే వాహనదారుడు గందరగో ళానికి గురై మీ వాహనాన్ని ఢీకొట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సం దర్భాలు ద్విచక్రవాహనదారుడికి ప్రాణ గండాన్ని తీసుకొస్తున్నాయి. అందుకే సైబరాబాద్‌ పోలీసులు వాహనానికి అద్దం లేకపోతే రూ.135 చలాన్‌ వేస్తున్నారు. గత మార్చి నుంచి మే 19 వరకు సైబరాబాద్‌ పోలీసులు 1,06,120 కేసులను నమోదు చేసి చలాన్‌లను జారీ చేశారు. ఇలా చలాన్‌లు జారీ చేసిన వారి నుంచి ట్రాఫిక్‌ పోలీసులు 1,05,67,600 డబ్బులు వసూలు చేయనున్నారు. ఈ కేసులను మోటార్‌ వెహికిల్‌ యాక్ట్‌ 117(14) కింద అభియోగాన్ని నమోదు చేస్తున్నారు.


logo