హైదరాబాద్ : హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మంగళవారం జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఓ వాహనదారుడు 2017 నుంచి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ నగరంలో తిరుగుతున్నాడు. అతని బైక్పై 130 పెండింగ్ చలాన్లు (రూ. 35,950) ఉన్నట్లు ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు. స్పీడ్ డ్రైవింగ్, రాంగ్ పార్కింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు చలాన్లు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఆ వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. వాహన యజమాని విజయ్ మాదాపూర్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఫైన్ చెల్లించేందుకు విజయ్ అంగీకరించలేదు.