ఆదివారం 17 జనవరి 2021
Hyderabad - Jun 06, 2020 , 00:59:11

రెండు ఘటనలు.. రెండు హత్యలు

రెండు ఘటనలు.. రెండు హత్యలు

 మెహిదీపట్నం : స్నేహితుల మధ్య గొడవ... ఓ యువకుడి హత్యకు దారి తీసింది. బండరాయితో మోది దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన గోల్కొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. నగర జాయింట్‌ కమిషనర్‌ , పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం... మల్లెపల్లిలో నివాసం ఉండే రాహుల్‌ చంద్‌ అగర్వాల్‌(27), అజహర్‌(28)లు చిన్ననాటి స్నేహితులు. రాహుల్‌ చంద్‌ మల్లెపల్లి ప్రియా థియేటర్‌ సమీపంలో  మెడికల్‌హాల్‌ను నిర్వహిస్తున్నాడు. గురువారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రాహుల్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి.. హత్యకు గురయ్యాడు. 

      శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో గోల్కొండ బంజారా దర్వాజ సమీపంలోని శ్మశాన వాటిక వద్ద ఓ యువకుడు హత్యకు గురై ఉండగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. ఆధారాల కోసం పరిశీలిస్తుండగా.. సమీపంలో  హోండా యాక్టివా  కనపడింది. దాన్ని పరిశీలించగా  మెహిదీపట్నం విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన ఆం ధ్రాబ్యాంక్‌ పాసుబుక్‌ కనపడింది. అందులో ఉన్న వివరాల ప్రకారం మృతుడు రాహుల్‌ చంద్‌ అగర్వాల్‌గా గుర్తించారు. వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో.. స్నేహితుడు అజహర్‌.. రాహుల్‌ చంద్‌ను బండరాయితో తలపై బలంగా మోది హత్యచేసినట్లు గుర్తించారు. వారి మధ్య ఏదైనా గొడవ జరిగి ఉండవచ్చుననిపోలీసులు భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

  ఆస్తి పంపకాల విభేదాలతో యువకుడు...

 చార్మినార్‌ : ఆస్తి పంపకాల్లో వచ్చిన మనస్పర్థల కారణంగా.. ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. చర్చించు కుందామని పిలిపించి.. కత్తులతో దాడిచేసి హతమార్చారు. ఈ సంఘటన రెయిన్‌ బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకు న్నది. మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్‌ కథనం ప్రకారం... పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే మహ్మద్‌ ఇమ్రాన్‌ (20)కు ఆస్తి పం పకాల విషయంలో కొంత కాలంగా బంధువులతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో చర్చిం చుకుందామని శుక్రవారం సాయంత్రం స్థానికంగా ఉన్న ఓ హోటల్‌ వద్దకు ఇమ్రాన్‌ను పిలిపించారు. అతడు రాగానే.. మరో వర్గంవారు కత్తులతో దాడి చేసి ఇమ్రాన్‌ను హత్య చేశారు. స్థానికుల సమాచారం మేరకు పో లీసులు వెళ్లి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఈ మేరకు పోలీ సులు కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను రంగంలోకి దించామని ఏసీపీ తెలిపారు.