బుధవారం 27 జనవరి 2021
Hyderabad - Nov 29, 2020 , 06:55:33

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

హైదరాబాద్‌ : అర్ధరాత్రి టీ తాగుతున్న ఉద్యోగులను స్టేషన్‌కు రమ్మని పిలిచి బెదిరించి డబ్బులు డిమాండ్‌ చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌  సస్పెండ్‌ చేశారు. ఇటీవల చౌటుప్పల్‌ ప్రాంతంలోని దివీస్‌ ఫార్మా కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి తోటి మహిళా ఉద్యోగితో కలిసి అర్ధరాత్రి 2:30 గంటల ప్రాంతంలో టీ తాగుతున్నారు. అదే సమయంలో గస్తీ నిర్వహిస్తున్న చౌటుప్పల్‌ పోలీసుస్టేషన్‌కు చెందిన చంద్రశేఖర్‌, లింగస్వామి వారిని అటకాయించి స్టేషన్‌కు రావాలని బెదిరించారు. 

తాము విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్నామని చెప్పినా వినకుండా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని దివీస్‌ ఫార్మా ఉద్యోగులు యాదాద్రి-భువనగిరి డీసీపీ నారాయణరెడ్డికి ఫిర్యాదు చేశారు. దీనిపై డీసీపీ ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణలో వెలుగుచూసిన ఆధారాలతో  సీపీ మహేశ్‌ భగవత్‌ కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తు ఉత్తర్వులు జారీచేశారు.


logo