శనివారం 11 జూలై 2020
Hyderabad - Jun 03, 2020 , 02:11:54

కొకైన్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌

కొకైన్‌ పట్టివేత.. ఇద్దరు అరెస్ట్‌

హైదరాబాద్ : బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు కొకైన్‌ తీసుకువచ్చిన ఇద్దరిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి 54 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్టు హైదరాబాద్‌ అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌. అంజిరెడ్డి తెలిపారు.  అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కథనం ప్రకారం.. బెంగళూరులో నైజీరియన్‌ నుంచి 70 గ్రాముల కొకైన్‌ కొనుగోలు చేసిన ఇద్దరు హైదరాబాద్‌ వస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్‌శాఖ జాయింట్‌ కమిషనర్‌ ఎన్‌.ఏ. అజయ్‌రావుకు వచ్చింది. ఆయన ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ ఎన్‌. అంజిరెడ్డి నేతృత్వంలో తిరుమలగిరి ప్రాంతంలోని సరస్వతీనగర్‌లో ఇద్దరిని పట్టుకున్నారు.

వారినుంచి ఒక స్కోడాకారు, మరో మారుతి స్విఫ్ట్‌, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరు పంజాగుట్టకు చెందిన తరణ్‌జ్యోతి సింగ్‌, లోతుకుంట సరస్వతీనగర్‌కు చెందిన అమిత్‌కుమార్‌ ఉన్నట్టు తెలిపారు. కొవిడ్‌ మాస్కుల కొనుగోలు ముసుగులో కొకైన్‌ తరలిస్తున్నారని వెల్లడించారు.  నిందితులను పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన టీమ్‌లో సీఐ నరేందర్‌, ఎస్‌ఐ నజీర్‌ హుస్సేన్‌, కానిస్టేబుళ్లు భాస్కర్‌రెడ్డి, అజీం, శ్రీధర్‌, ప్రకాశ్‌, రాకేశ్‌, తేజేశ్వర్‌, గోపాల్‌, బాలునాయక్‌ ఉన్నారు.


logo