ధూంధాంగా టీఆర్ఎస్ ప్రచారం

హైదరాబాద్ : గ్రేటర్లో పోరులో వందకుపైగా స్థానాలను దక్కించుకోవడమే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ చేపట్టిన రోడ్‌షోలు సూపర్‌హిట్ అయ్యా యి. కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్, మహేశ్వరం, ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో మంత్రి కేటీఆర్ తనదైన ైస్టెల్లో ప్రసంగించి అందరినీ ఆకట్టుకున్నారు. రోడ్‌షోలకు ఎటు చూసినా జన ప్రభంజనమే కనిపిస్తున్నది. పాదయాత్రలు, బైక్‌ర్యాలీల ద్వా రా సభాస్థలాలకు వచ్చి కేటీఆర్‌కు బ్రహ్మరథం పడుతున్నారు.
ధూంధాంగా గులాబీ కోలాహలం
గ్రేటర్లో కేటీఆర్ రోడ్ షోలు బహిరంగ సభలా? విజయ యాత్రలా అనే రీతిలో సాగుతున్నాయి. రోడ్‌షోలకు మహిళలు, యువకులు భారీగా తరలివస్తున్నారు. అభ్యర్థుల పాదయాత్రలో డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలు, బోనాలతో బస్తీలు హోరెత్తుతున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రకటన ముందే అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహాక సమావేశాలు నిర్వహించిన అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో దూకుడు పెంచింది. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు అందనంతగా వేగంగా ప్రచారంలో దూసుకుపోతున్నది. భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మున్ముందుకు సాగుతున్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలను ప్రజలకు వివరిస్తున్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన వరాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. విశ్వ నగరం కావాలా? విద్వేష నగరం కావాలా? అనే నినాదం ప్రజలను ఆలోచింపజేస్తున్నది.
తాజావార్తలు
- సీతారామ ప్రాజెక్టు పనుల వేగవంతానికి సీఎం కేసీఆర్ ఆదేశం
- 36 గంటల్లో భేషరతు క్షమాపణః సువేందుకు అభిషేక్ సవాల్
- కబడ్డీ ఆటలో.. యువకుడు మృతి
- ట్రంప్ వీడ్కోలు.. నెటిజెన్ల వెక్కిరింతలు
- కృష్ణంరాజును ప్రభాస్ ఎలా రెడీ చేస్తున్నాడో చూడండి..వీడియో
- నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
- గంగా జలానికి తరలివెళ్లిన మెస్రం గిరిజనులు
- బాలకృష్ణ కోసం 'క్రాక్' డైరెక్టర్ పవర్ఫుల్ స్టోరీ..!
- సీరం ఇన్స్టిట్యూట్ అగ్నిప్రమాదంలో.. ఐదుగురు మృతి