యువత సన్మార్గం వైపు అడుగులేయాలి

- రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి
- ముగిసిన టీఆర్ఎస్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్
కంటోన్మెంట్: క్రీడలు యువతను సన్మార్గం వైపునకు నడిపించేందుకు దోహదపడుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలోని తౌఫిక్, జున్భాయ్ ఆధ్వర్యంలో న్యూ బోయిన్‌పల్లిలోని ఫైజన్ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన టీఆర్ఎస్ నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు రెరండు రోజుల పాటు ఉత్కంఠగా సాగాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20 జట్లు పాల్గొనగా, ఆదివారం ఫైనల్ పోటీల్లో బార్కాస్-11 జట్టు విజేతగా నిలువగా, భరత్‌నగర్‌కు చెందిన జట్టు రెండోస్థానంలో నిలిచింది. క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డితో పాటు టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డిలు హాజరయ్యారు. అనంతరం, విజేత జట్టుకు రూ.30 వేలు, రన్నర్ జట్టుకు రూ.15 వేల నగదును అందజేశారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ యువత క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. యువతకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మైనార్టీ అధ్యక్షుడు హాసీన్ఖాన్, ఇర్ఫాన్, తారీఖ్, ఆతీఫ్, సుల్తాన్, పప్పు, సజీద్, హకీబ్, ఇమ్రాన్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అంబానీ ఫ్యామిలీకి బెదిరింపు లేఖ రాలేదు..
- భార్యతో గొడవ.. గొంతు కోసుకున్న భర్త
- ఖలిస్తాన్ గ్రూపుల బెదిరింపు : కెనడాలో హిందువులపై దాడుల పట్ల ఆందోళన
- పేదల కోసం ఎంజీఆర్ ఎంతో చేశారు : ప్రధాని మోదీ
- గర్భిణి చితిలో బంగారం కోసం సెర్చ్.. నలుగురు నిందితులు అరెస్ట్
- కోచింగ్ సెంటర్ విద్యార్థులకు కొవిడ్ టెస్టులు తప్పనిసరి
- మరో హాస్పిటల్‌కు టైగర్ వుడ్స్ తరలింపు
- ఆస్కార్ రేసులో ఆకాశం నీ హద్దురా.. ఆనందంలో చిత్ర బృందం
- లవర్‌తో గొడవ.. ఆటోలో నుంచి దూకిన యువతి
- కోదాడలో ప్రేమజంట ఆత్మహత్య