సోమవారం 23 నవంబర్ 2020
Hyderabad - Aug 16, 2020 , 23:45:52

వాజ్‌పేయికి నివాళి

వాజ్‌పేయికి నివాళి

మణికొండ: మాజీ ప్రధాన మంత్రి దివంగత అటల్‌ బిహారి వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా  నార్సింగి, మణికొండ మున్సిపాలిటీలో ఆదివారం బీజేపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  బీజేపీ రాష్ట్ర  కార్యవర్గ సభ్యుడు అంజన్‌కుమార్‌గౌడ్‌, మణికొండ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు  సీహెచ్‌ బీరప్ప, సీహెచ్‌ భిక్షపతి, నాయకులు ఎల్‌.నాగేశ్‌, సిద్దప్ప, చారి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.