గురువారం 03 డిసెంబర్ 2020
Hyderabad - Sep 03, 2020 , 00:25:27

పారదర్శక సేవలందించాలి

పారదర్శక సేవలందించాలి

 మేడ్చల్‌, నమస్తే తెలంగాణ : రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ పారదర్శకమైన సేవలను అందించాలని మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ డా.వాసం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్‌ రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా చూడాలన్నారు. రైతుబంధు, రైతు బీమా పథకాలను సక్రమంగా అమలు అయ్యేటట్లు చూడాలన్నారు. పాస్‌పుస్తకాలను సకాలంలో అందించాలన్నారు. రైతు వేదికల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని.. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలన్నారు. డబుల్‌ బెడ్‌ రూం గృహాలు వందశాతం అర్హులకే అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అక్రమ లే అవుట్లు, నాలాల ఆక్రమణలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ విద్యాసాగర్‌, కీసర ఆర్డీవో రవి, మల్కాజిగిరి ఆర్డీవో మల్లయ్య, ఇరిగేషన్‌ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.