e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home హైదరాబాద్‌ ట్రాన్స్‌జండర్స్‌ కమ్యూనిటీ డెస్క్‌

ట్రాన్స్‌జండర్స్‌ కమ్యూనిటీ డెస్క్‌

ట్రాన్స్‌జండర్స్‌ కమ్యూనిటీ డెస్క్‌

దేశంలోనే మొదటిసారిగా సైబరాబాద్‌లో ప్రారంభం  సీపీ వీసీ సజ్జనార్‌ శేరిలింగంపల్లి, మార్చి 6: దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా ట్రాన్స్‌జండర్ల సమస్యల పరిష్కారానికి ట్రాన్స్‌జండర్స్‌ కమ్యూనిటీ డెస్క్‌ సైబరాబాద్‌లో అందుబాటులోకి తీసుకువచ్చామని సీపీ సజ్జనార్‌ తెలిపారు. గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌లో సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌(ఎస్సీఎస్సీ), సైబరాబాద్‌ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ట్రాన్స్‌జండర్స్‌ కమ్యూనిటీ డెస్క్‌’ను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రూపొందించిన బ్రోచర్‌ను సీపీ అవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ట్రాన్స్‌జండర్లు సమాజంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, వివక్ష గురవు తూ, సమాజంలో చిన్నచూపునకు గురవుతున్నరన్నారు.  సంక్షేమ పథకాలు అందుబాటులో ఉన్నా వాటిని అందిపుచ్చుకోకపోవడం, సరైన అవగాహన లేకపోవడం లాంటి అనేక సమస్యలతో వారు సతమతమవుతున్నారన్నారు. అలాంటి వారందరికీ అండగా నిలిచేందుకు ఈ డెస్క్‌ ఉపయోగపడుతుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా డెస్క్‌ను ఏర్పాటుచేసిన ఘనత సైబరాబాద్‌ పోలీసులకు దక్కిందన్నారు. ట్రాన్స్‌జండర్లు డెస్క్‌ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతిభా నైపుణ్యాల మేరకు ఉపాధి అవకాశాలు అందించనున్నట్లు తెలిపారు. సంఘవిద్రోహ పనులు, అసాంఘిక కార్యకలాపాలు మానుకోవాలన్నా రు. రంగారెడ్డి, మేడ్చల్‌ జేసీలు ప్రతీక్‌జైన్‌, విద్యాసాగర్‌   మాట్లాడుతూ ట్రాన్స్‌జండ ర్ల సంక్షేమానికి ఇది తొలి అడుగని అన్నా రు.   పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతా కృష్ణణ్‌, డీసీపీలు అనసూయ, వెంకటేశ్వ ర్లు, పద్మజా, విజయ్‌కుమార్‌, ప్రకాశ్‌రెడ్డి, ఎస్సీఎస్సీ ప్రతినిధి కృష్ణ పాల్గొన్నారు. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ట్రాన్స్‌జండర్స్‌ కమ్యూనిటీ డెస్క్‌

ట్రెండింగ్‌

Advertisement