మంగళవారం 01 డిసెంబర్ 2020
Hyderabad - Oct 30, 2020 , 08:15:17

పాతబస్తీ పరిసరాల్లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

పాతబస్తీ పరిసరాల్లో నేడు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ :  మిలాద్‌ ఉల్‌ నబీ సందర్భంగా శుక్రవారం ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాతబస్తీతో పాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఈ సందర్భంగా ర్యాలీలు కొనసాగనుండటంతో చాదర్‌ఘాట్‌ వద్ద ఆర్టీసీ బస్సుల మళ్లింపు ఉంటుందని, ఎస్‌జే రోటరీ, మిరాలం మండి రోడ్డుపై ర్యాలీ ముగిసే వరకు బస్సులకు అనుమతి ఉండదని వెల్లడించారు. ర్యాలీలో పాల్గొనేవారు తమ వాహనాలను చార్మినార్‌ బస్‌ టర్మినల్‌లో పార్కు చేయాలని సూచించారు. ర్యాలీ కొనసాగే సమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ మళ్లింపు ఉంటుందని తెలిపారు. ఈ ర్యాలీలు పాతబస్తీలోని చార్మినార్‌, మొఘల్‌పురా, గుల్జార్‌ హౌస్‌, ఝాన్సీబజార్‌, సిటీ కాలేజీ, మదీనా, ఢిల్లీగేట్‌, దారుల్‌ షిఫా, చట్టబజార్‌, ఏపీఏటీ,  ఎతెబార్‌చౌక్‌, కోట్ల అలీజ పరిసర ప్రాంతాల మీదుగా ర్యాలీ నిర్వహిస్తారు. ర్యాలీల సందర్భంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రత్యామ్నాయ  మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్‌ అదనపు సీపీ సూచించారు.