e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home News రేపు ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల జాత‌ర‌.. 25, 26 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

రేపు ఉజ్జ‌యిని మ‌హంకాళి బోనాల జాత‌ర‌.. 25, 26 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

సిటీబ్యూరో, జూలై 23 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో ఆలయం సమీపంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 25వ తేదీ తెల్లవారు జాము 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు, మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. బోనాల పండుగ సందర్భంగా వచ్చే భక్తులతో ఆలయం సమీపంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలు, వాహనాలను దారి మళ్లిస్తున్నట్టు కమిషనర్‌ పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఆంక్షలు, ట్రాఫిక్‌ మళ్లింపు, వాహనాల పార్కింగ్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ట్రాఫిక్‌ ఆంక్షలు (25వ తేదీ ఉదయం 4 గంటల నుంచి పూజలు పూర్తయ్యే వరకు)

-పూజల సందర్భంగా మహంకాళి ఆలయం, టొబాకోబజార్‌ హిల్‌ స్ట్రీట్‌, జనరల్‌ బజార్‌లో ట్రాఫిక్‌ రాకపోకలు పూర్తిగా నిలిపివేసి, రోడ్లను మూసివేస్తారు.
-సుభాష్‌ రోడ్‌, బాటా చౌరస్తా నుంచి రాంగోపాల్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ఉన్న మార్గాలను మూసివేస్తారు.
-అడవయ్య చౌరస్తా నుంచి మహంకాళి ఆలయం మార్గాలను మూసివేస్తారు.
-జనరల్‌ బజార్‌ నుంచి ఆలయం మార్గం రోడ్డు మూసివేస్తారు.

దారి మళ్లింపు..

- Advertisement -

– కర్బల మైదాన్‌ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను రాణిగంజ్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి మినిస్టర్‌ రోడ్డు, రసూల్‌పురా క్రాస్‌ రోడ్స్‌, వైఎంసీఏ ఎక్స్‌ రోడ్స్‌, జాన్స్‌ రోటరీ, గోపాలపురం లేన్‌, రైల్వే స్టేషన్‌ వైపు దారి మళ్లిస్తారు.
-ఆర్టీసీ బస్సులు రైల్వే స్టేషన్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వెళ్లేందుకు అల్ఫా ఎక్స్‌ రోడ్డు హోటల్‌, గాంధీ ఎక్స్‌ రోడ్స్‌, సజ్జనాల స్ట్రీట్‌, ఓల్డ్‌ మహంకాళి ట్రాఫిక్‌ పీఎస్‌, ఘాస్‌మండి, , బైబుల్‌ హౌస్‌, కర్బల మైదన్‌ రూట్‌లో వెళ్లాలి.
-తాడ్‌బన్‌ వెళ్లే బస్సులు క్లాక్‌టవర్‌, ప్యాట్నీ ఎక్స్‌ రోడ్డు, వైఎంసీఏ, ఎస్‌బీహెచ్‌ ఎక్స్‌ రోడ్స్‌ మీదుగా వెళ్లాలి… బైబిల్‌ హౌస్‌ నుంచి వచ్చే వాహనాలను ఘాస్‌మండి ఎక్స్‌ రోడ్డు నుంచి సజ్జన్‌నాల్‌ స్ట్రీట్‌, హిల్స్‌ స్ట్రీట్‌ వైపు మళ్లిస్తారు.
-ఎస్‌బీహెచ్‌ చౌరస్తా నుంచి ఆర్‌పీ రోడ్డు వైపు వెళ్లే సాధారణ ట్రాఫిక్‌ను ప్యాట్నీ చౌరస్తా నుంచి క్లాక్‌ టవర్‌, ప్యారడైజ్‌ వైపు దారి మళ్లిస్తారు.
-ప్యారడైజ్‌ నుంచి ఆర్పీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యాట్నీ సెంటర్‌ వద్ద ఎస్‌బీహెచ్‌, క్లాక్‌ టవర్‌ వైపు మళ్లిస్తారు.
-క్లాక్‌ టవర్‌ నుంచి ఆర్పీ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ప్యాట్సీ ఎక్స్‌ రోడ్డు నుంచి ఎస్‌బీహెచ్‌ ఎక్స్‌ రోడ్డు, ప్యారడైజ్‌ వైపు మళ్లిస్తారు.
-సీటీఓ జంక్షన్‌ నుంచి ఎంజీ రోడ్డు వెళ్లే వాహనాలను ప్యారడైజ్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద హెచ్‌డీఎప్‌సీ బ్యాంకు, సింధి కాలనీ, మినిస్టర్‌ రోడ్డు వైపు మళ్లిస్తారు.

26వ తేదీ (మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 వరకు)

  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి సెయింట్‌ మేరీ మధ్య మార్గాలను మూసేస్తారు.
  • సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి హకీంపేట, బోయిన్‌పల్లి, బాలానగర్‌, అమీర్‌పేట వెళ్లే ట్రాఫిక్‌ను క్లాక్‌ టవర్‌ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి తిరిగి తమ గమ్య స్థానాలకు వయా ప్యాట్నీ, ఎస్‌బీహెచ్‌ వైపు నుంచి వెళ్లాలి.
    వాహనాల పార్కింగ్‌ ప్రదేశాలు
  • సెయింట్‌ జాన్స్‌ రోటరీ, స్వీకార్‌, ఉపకార్‌, ఎస్‌బీహెచ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు హరిహర కళాభవన్‌, మహబూబీయ కాలేజీలో పార్కు చేయాలి.
  • కర్బల మైదన్‌, బైబిల్‌ హౌస్‌, ఘాస్‌మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా హై స్కూల్‌ ప్రాంగణంలో పార్కు చేయాలి.
  • రాణిగంజ్‌, అడవయ్య క్రాస్‌ రోడ్స్‌ వైపు నుంచి వచ్చే వాహనాలు ప్రభుత్వ అడవయ్య మెమోరియల్‌ హై స్కూల్‌ ప్రాంగణంలో పార్కు చేయాలి.
  • సుభాష్‌ రోడ్డు వైపు వాహనాలు ఓల్డ్‌ జింఖానా మైదానంలో పార్కు చేయాలి.
  • మంజు థియేటర్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను అంజలి థియేటర్‌ లేన్‌లో పార్కు చేయాలి.
  • ఉత్సవాలకు వస్తున్న భక్తులు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు పాటిస్తూ సహకరించాలని కమిషనర్‌ కోరారు.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana