e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News వాహనదారులకు అలర్ట్‌.. బల్కంపేటలో ట్రాఫిక్‌ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్‌.. బల్కంపేటలో ట్రాఫిక్‌ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్‌.. బల్కంపేటలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌ : బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం బల్కంపేటలో ఆంక్షలను అమలు చేసింది. సోమవారం నుండి బుధవారం వరకు బల్కంపేట ఏరియాలో ట్రాఫిక్‌ మళ్లింపులు పేర్కొంది. కావునా వాహనదారులు ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్‌ జాం తప్పించుకునేందుకు అనువైన ఇతర మార్గాలను ఎంచుకోవాల్సిందిగా సూచించింది.

సత్యం థియేటర్‌ నుండి ఫతేనగర్‌ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను ఎస్‌ఎస్‌ బేకరీ వద్ద బీకే గూడ క్రాస్‌ రోడ్‌ వైపుగా ఫతేనగర్‌కు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. అదేవిధంగా డీకే రోడ్‌ నుండి ఆర్‌అండ్‌బీ బల్కంపేట వైపు వెళ్లే వాహనదారులను పద్మశ్రీ అపార్ట్‌మెంట్స్‌ వద్ద దారి మళ్లించనున్నారు. కాగా నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రి వైపు వెళ్లే అపార్ట్‌మెంట్లకు ఎదురుగా ఉన్న లేన్‌ను మూసివేస్తున్నట్లు చెప్పారు.

- Advertisement -

ఫతేనగర్‌ నుంచి సత్యం థియేటర్‌ వైపు వచ్చే ట్రాఫిక్‌ను బేగంపేట ఇన్‌ గేట్‌ వైపుగా న్యూ బ్రిడ్జి వద్ద దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. బేగంపేట నుండి బాలానగర్‌కు వెళ్లే వాహనాలను బేగంపేట గ్రీన్‌ల్యాండ్స్‌-లాల్‌ బంగ్లా-సత్యం థియేటర్‌ వైపు మళ్లించబడుతుందన్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌ టీ-జంక్షన్‌ నుండి ఫతే నగర్‌ వరకు బైలేన్లు, లింక్‌ రోడ్లు అన్ని మూసి ఉండనున్నట్లు తెలిపారు. వాహనదారులు విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ పోలీసులకు సహకరించాల్సిదిగా ఈ సందర్భంగా హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం విజ్ఞప్తి చేసింది. బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవంలో భాగంగా 12వ తేదీ సోమవారం సాయంత్రం ఎదుర్కోళ్లు, 13వ తేదీ మంగళవారం కళ్యాణం, 14వ తేదీ బుధవారం రథోత్సవం జరగనున్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
వాహనదారులకు అలర్ట్‌.. బల్కంపేటలో ట్రాఫిక్‌ ఆంక్షలు
వాహనదారులకు అలర్ట్‌.. బల్కంపేటలో ట్రాఫిక్‌ ఆంక్షలు
వాహనదారులకు అలర్ట్‌.. బల్కంపేటలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ట్రెండింగ్‌

Advertisement