హైదరాబాద్ : గగన్‌పహాడ్ వద్ద అప్ప చెరువుకు వరద పోటెత్తింది. దీంతో అప్ప చెరువు అలుగు పొంగిపొర్లుతున్నది. ఈ క్రమంలో హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో రాకపోకలు యథాతథంగా కొనసాగుతున్నాయి.