శుక్రవారం 10 జూలై 2020
Hyderabad - Jun 04, 2020 , 02:38:07

చురుకుగా సాగుతున్న పంజాగుట్ట ట్రై జంక్షన్‌ ఆధునీకరణ

చురుకుగా సాగుతున్న పంజాగుట్ట ట్రై జంక్షన్‌ ఆధునీకరణ

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ/బంజారాహిల్స్‌ : రూ. 48 లక్షల వ్యయంతో పంజాగుట్ట ట్రై జంక్షన్‌ ఆధునీకరణ పనులు  చేపట్టినట్లు నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తెలిపారు. ఇందులో భాగంగా ట్రాఫిక్‌కు అడ్డుగా ఉన్న  దివంగత మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డి విగ్రహాన్ని అక్కడి నుంచి తొలిగించి పక్కన ప్రతిష్ఠించేందుకు మేయర్‌ బుధవారం భూమిపూజ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రై జంక్షన్‌ అభివృద్ధి, విస్తరణ ప్రక్రియలో భాగంగా విగ్రహాన్ని పక్కకు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.  ఎస్‌ఆర్‌డీపీ కింద రూ. 23 కోట్లతో చేపట్టిన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, అలాగే రోడ్డు విస్తరణ పనులు కూడా చురుకుగా సాగుతున్నాయని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్‌,మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జోనల్‌ కమిషనర్‌ ప్రావీణ్య, డీఎంసీ గీతారాధిక, డీఈ శివానంద్‌ తదితరులు పాల్గొన్నారు.


logo