లాజిస్టిక్ పార్క్ రెడీ..

హైదరాబాద్ : సరుకు రవాణా రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసింది. అందులో భాగంగా మొదటి దశలో ఔటర్ రింగ్ రోడ్డు చు ట్టూ రెండు చోట్ల లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రూ.40 కోట్ల వ్యయంతో బాట సింగారం వద్ద 40 ఎకరాల్లో, మంగల్‌పల్లి వద్ద 22 ఎకరాల స్థలంలో సుమారు రూ.25 కోట్లతో పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో వీటిని చేపట్టారు. మంగల్‌పల్లి వద్ద నిర్మించిన లాజిస్టిక్ పార్కు గతేడాది ప్రారంభమవగా, బాట సింగారం లాజిస్టిక్ పార్కును 28న రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు.
అత్యున్నత ప్రమాణాలతో..
ఈ రెండు లాజిస్టిక్ పార్కులు ఔటర్ రింగు రోడ్డుపై ఉన్న పెద్ద అంబర్‌పేట ఇంటర్చేంజ్ 11కు సమీపంలోని హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి బాట సింగారం వద్ద, అదే విధంగా నాగార్జున సాగర్ హైవేపై ఓఆర్ఆర్ బెంగుళూ రు ఇంటర్చేంజ్ సమీపంలోని మంగల్‌పల్లి వద్ద నిర్మించారు. దేశ నలుమూలల నుంచి వచ్చే సరుకు రవాణ వాహనాలకు అవసరమైన అన్ని రకాల సేవలను అందించడమే లక్ష్యంగా లాజిస్టిక్ పార్కులను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించారు. హై సెక్యూరిటీ విధానంతో 24 గంటల పాటు సేవలందించేలా నిర్వహణ వ్యవస్థ పని చేస్తుంది. మినీ గోడౌన్స్, వసతి సౌకర్యం, ఆరోగ్య సంరక్షణ వంటివి లాజిస్టిక్ పార్కులో అందుబాటులో ఉంటాయి. వీటికి అవసరమైన భూములను హెచ్ఎండీఏ అందించగా, నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రైవేటు సంస్థలు వెచ్చిస్తున్నాయి. దీంతో అటు సరుకు రవాణా సాఫీగా సాగడంతో పాటు వందలాది మందికి ఉపాధి అవకాశాలు కలుగనున్నాయి.
ట్విట్ చేసిన మంత్రి కేటీఆర్
ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో బాటసింగారం వద్ద నిర్మించిన లాజిస్టిక్ పార్కును ఈ నెల 28న ప్రారంభిస్తున్నామని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ట్రక్ డాక్ లాజిస్టిక్ పార్కును పీపీపీ విధానంలో బాట సింగారం రెవెన్యూ పరిధిలో 40 ఎకరాల్లో సుమారు రూ.40 కోట్లతో నిర్మించినట్లు పేర్కొన్నారు. దేశంలోని నలుమూలల నుంచి వచ్చే రవాణ వాహనాలకు ఇది మెరుగైన సేవలను అందించనుందని తెలిపారు.
తాజావార్తలు
- ముచ్చటగా మూడోసారి తల్లి కాబోతున్న వండర్ వుమన్
- దేశంలో తగ్గిన కొవిడ్ కేసులు
- టీకా వేసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- రాష్ట్రంలో కరోనాను కట్టడి చేశాం : మంత్రి ఈటల రాజేందర్
- ప్రియా వారియర్‌కు బ్యాడ్ టైం..వర్కవుట్ కాని గ్లామర్ షో
- ఈ నెల 4న యాదాద్రికి సీఎం కేసీఆర్
- దర్శకుడికే టోకరా వేసిన కేటుగాడు
- ట్రక్కు బోల్తా.. ఆరుగురు మృతి.. 15 మందికి గాయాలు
- ఎల్లో డ్రెస్‌లో అదరగొడుతున్న అందాల శ్రీముఖి..!
- లారీని ఢీకొట్టిన కారు.. నలుగురి దుర్మరణం