గురువారం 04 మార్చి 2021
Hyderabad - Nov 07, 2020 , 07:39:15

నేడు నాయిని నర్సింహారెడ్డి సంతాపసభ

నేడు నాయిని నర్సింహారెడ్డి సంతాపసభ

  • హాజరు కానున్న పలువురు ప్రముఖులు, మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సంతాప సభను కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజీ ఓల్డ్‌ స్టూడెంట్స్‌ కాన్ఫరెన్స్‌ హాలులో శనివారం సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ మేరకు 1969 తెలంగాణ విద్యార్థి యువ సంఘర్షణ సమితి అధ్యక్షుడు దండు శంకర్‌  శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. డాక్టర్‌ గోపాలకృష్ణ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా  హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ తదితరులు హాజరుకానున్నారని తెలిపారు. నాయిని అభిమానులు ఈ సభకు భారీగా తరలిరావాలని ఆయన  కోరారు. 

నాయినికి ఘన నివాళి 

హైదరాబాద్‌  : మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆయన భార్య అహాల్య దశ దిన కర్మను శుక్రవారం బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. నాయిని కుటుంబాన్ని ఓదార్చారు. నివాళులర్పించిన వారిలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు టి.హరీశ్‌ రావు, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, జి.జగదీశ్‌ రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, సీహెచ్‌.మల్లారెడ్డి ఉన్నారు.  రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎంపీలు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, రంజిత్‌ రెడ్డి , బీబీ పాటిల్‌, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, శేరి సుభాష్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డి, పురాణం సతీశ్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, శాసనమండలి చీఫ్‌ విప్‌ బి.వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్‌, శాట్స్‌ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు నాయిని చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. 
VIDEOS

logo