సోమవారం 28 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:24:55

గ్రామీణ జీవనాన్ని తలపించేలా..

 గ్రామీణ జీవనాన్ని తలపించేలా..

పంచతత్వ పార్కుల ఏర్పాటు 

మాసబ్‌ట్యాంక్‌  చాచానెహ్రూ పార్కులో చురుగ్గా పనులు 

అహ్మద్‌నగర్‌,ఆగస్టు 10 : పచ్చదనంతో స్వచ్ఛమైన గాలినందిస్తున్న జీహెచ్‌ఎంసీ పార్కుల్లో శారీరక , మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే పంచతత్వ పార్కులు అందుబాటులోకి రానున్నాయి. ఈ పార్కులలో ప్రత్యేకంగా రూపొందించే వాకింగ్‌ ట్రాక్‌లలో పాదాలను ప్రభావితం చేసే అష్ట బంధనాలు సిద్ధం కానున్నాయి. ఇటీవల వనస్థలిపురంలోని సచివాలయనగర్‌ కాలనీ పార్కు తరహాలో నగరంలోని ఇందిరా పార్కుతో పాటు మాసబ్‌ట్యాంక్‌ చాచానెహ్రూ పార్కులో ఈ పంచతత్వ పార్కులను జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్న జీహెచ్‌ఎంసీ పార్కులలో మానసిక ఒత్తిడిని జయించి, శారీరక బలహీనతలను అధిగమించేందుకు ఈ విధానంలో కొత్తగా వాకింగ్‌ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు మాసబ్‌ట్యాంక్‌ చాచానెహ్రూ  పార్కులో పంచతత్వ వాకింగ్‌ ట్రాక్‌ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి.

వాకర్స్‌ కోసం 8-9 రకాల ప్రత్యేక ట్రాక్‌లు..  

 గ్రామాల్లో పాదరక్షలు లేకుండా మట్టి  , పొలాల్లో , రహదారులు, కొండలు, గుట్టలు, రాళ్లల్లో తిరిగే  ప్రజల జీవనాన్ని తలపించేలా  పార్కుల్లో  వాకింగ్‌ ట్రాక్‌లు సిద్ధం చేస్తున్నారు.   పంచతత్వ పార్కులలో 8-9 రకాల వాకింగ్‌ ట్రాక్‌లను ఏర్పాటు చేస్తున్నారు.  రోజుకు 10 నిముషాలు నడిస్తే శరీరంలోని అన్ని అవయవాలకు మేలు చేకూరడంతో పాటు బీపీ , షుగర్‌ నియంత్రణలో ఉండి మానసిక ఒత్తిడికి సైతం చెక్‌ పెట్టవచ్చని జీహెచ్‌ఎంసీ అధికారులు  పేర్కొంటున్నారు.                     

ప్రజల ఆరోగ్యం కోసం..

ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యంగా అందరికోసం పార్కులలో వీటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ పంచతత్వ పార్కులతో అనారోగ్యంగా ఉన్నవారు తమ ఆరోగ్యాలను కాపాడుకోవడంతో పాటు వృద్ధులు , వాకర్స్‌ మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. 

 -  వి.శ్రీనివాస్‌ , డిప్యూటీ డైరెక్టర్‌ ,  అర్బన్‌ బయోడైవర్సిటీ , జీహెచ్‌ఎంసీపంచతత్వ పార్కుల ఏర్పాటు 

 -  వి.శ్రీనివాస్‌ , డిప్యూటీ డైరెక్టర్‌ ,  అర్బన్‌ బయోడైవర్సిటీ , జీహెచ్‌ఎంసీ

logo