మంగళవారం 26 జనవరి 2021
Hyderabad - Nov 27, 2020 , 08:00:42

నేడు మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం

 నేడు మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం

హిమాయత్‌నగర్‌: మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం శుక్రవారం సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో నిర్వహిస్తున్నట్లు మున్నూరుకాపు కో-ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్లు డాక్టర్‌ కొండ దేవయ్య, ఎంహెచ్‌ఎన్‌రావు తెలిపారు. గురువారం నారాయణగూడలో కో-ఆర్డినేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్‌, గంగుల కమలాకర్‌, ఎంపీ కేశవరావు, మండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ పాల్గొంటారని తెలిపారు.


logo