శనివారం 23 జనవరి 2021
Hyderabad - Nov 28, 2020 , 10:08:44

పెండ్లి అప్పు తీర్చేందుకు ఇంట్లోనే చోరీ

పెండ్లి అప్పు తీర్చేందుకు ఇంట్లోనే చోరీ

హైదరాబాద్‌ : తన పెండ్లి కోసం తల్లి చేసిన అప్పును తీర్చేందుకు ఓ కూతురు అత్తవారింట్లోనే చోరీకి పాల్పడిన ఘటన యాప్రాల్‌ కిందిబస్తీలో చోటుచేసుకుంది. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. యాప్రాల్‌కు చెందిన విశ్వనాథ్‌ 2016లో సోనీని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ పెండ్లికి సోనీ తల్లి లీలావతి తన స్థలాన్ని రూ.30 లక్షలకు కుదువబెట్టింది. ఆ అప్పు తీర్చేందుకు తల్లీ కూతుళ్లు కలిసి ఓ పథకం వేశారు. ఈ నెల 23న విశ్వనాథ్‌ కుటుంబం మొత్తం ఓ పెండ్లికి వెళ్లింది చూసి వారు చోరీకి పాల్పడ్డారు. తన వద్దనున్న మరో తాళంచెవితో ఇంటి తాళం తీసిన సోనీ బెడ్రూంలోని అల్మారాలో ఉన్న 44 తులాల బంగారు ఆభరణాలను అపహరించింది. రాత్రి ఇంటికి వచ్చి చోరీ జరిగిన విషయం తెలుసుకున్న విశ్వనాథ్‌ కుటుంబం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించడంతో సోనీ, ఆమె తల్లి చేసిన చోరీ బయటపడింది. దీంతో తల్లీకూతుళ్లను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.logo