మంగళవారం 20 అక్టోబర్ 2020
Hyderabad - Sep 30, 2020 , 07:07:46

అధికారుల కృషి అభినందనీయం.. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల

అధికారుల కృషి అభినందనీయం.. టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల

సుల్తాన్‌బజార్‌:  కంటి వెలుగు కార్యక్రమాన్ని   విజయవంతం చేసిన ఘనత ఆప్తాల్‌మిక్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ది అని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌, మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి  అన్నారు. ఈ మేరకు ఆప్తాల్‌మిక్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆరుట్ల వేణుగోపాల్‌ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన సభను నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో నిర్వహించారు. వేణుగోపాల్‌ను శాలువాతో ఘ నంగా సన్మానించారు.  కార్యక్రమంలో కేంద్ర కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్‌( చందు), అసోసియేషన్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు సి. దత్తాత్రేయ, ప్రధాన కార్యదర్శి కె.కమలాకర్‌రెడ్డి, సలహాదారులు ఎం.చంద్రశేఖర్‌, నరసింహాచారి, మల్లారెడ్డి, ఉపాధ్యక్షులు కె.బాలరాజు, ప్రవీణ్‌, కార్యనిర్వాహణ కార్యదర్శులు ప్రసాద్‌, మోహన్‌, తిరుపతిరావు, నాగర్‌కర్నూలు జిల్లా అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు  తది తరులు పాల్గొన్నారు.

మిగిలిన 50 శాతం వేతనాన్ని ఇవ్వాలి

ఉద్యోగులకు రావల్సిన రెండు డీఏలు, కరోనా నేపథ్యంలో ఇచ్చిన 50 శాతంతో పాటు మిగిలిన 50 శాతం వేతనాన్ని ఇవ్వాలని ప్రభుత్వాన్ని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌ కోరారు.  కార్యక్రమంలో నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు కిషన్‌,కేంద్ర సంఘం అసోసియేట్‌ అధ్యక్షురాలు బండారు రేచల్‌, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కార్యనిర్వాహక కార్యదర్శి ఇటిక్యాల కొండల్‌రెడ్డి, నగర శాఖ కార్యదర్శి కట్కూరి శ్రీకాంత్‌  తదితరులు పాల్గొన్నారు.


logo