ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Hyderabad - Aug 11, 2020 , 00:06:12

ముంపు సమస్యను అధిగమించాలి

ముంపు సమస్యను అధిగమించాలి

 కుత్బుల్లాపూర్‌ : నియోజకవర్గంలో వర్షాకాలంలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో తలెత్తే సమస్యను అధిగమించడంతో పాటు మంచినీరు, మురుగు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌ జలమండలి అధికారులను ఆదేశించారు. సోమవారం పేట్‌ బషీరాబాద్‌ క్యాంపు కార్యాలయం నుంచి వాటర్‌ వర్క్స్‌ సీజీఎం అనిల్‌కుమార్‌తో పాటు అధికారులతో సమస్యలు, అభివృద్ధి పనులపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గంలో కొత్తపైపులైన్‌ నిర్మాణాలకు రూ. 3 కోట్ల నిధులకు అదనంగా మరో రూ. కోటి మంజూరు చేయిస్తానని, వెంటనే నిర్మాణ పనులకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆయా బస్తీల్లో ప్రస్తుతం కొనసాగుతున్న డ్రైనేజీ, మంచినీటి పైపులైన్ల నిర్మాణాలపై ఆరా తీశారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని, అభివృద్ధి పనులపై ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు.


logo