శుక్రవారం 30 అక్టోబర్ 2020
Hyderabad - Aug 15, 2020 , 00:01:16

‘యోధుల’ సేవలకు వెలకట్టలేం

‘యోధుల’ సేవలకు వెలకట్టలేం

ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కరోనా నియంత్రణలో ‘యోధుల’ సేవలను కొనియాడిన ఎమ్మెల్యే

కార్మికులకు రక్షణ కిట్లు అందజేత 

కేపీహెచ్‌బీకాలనీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ పారిశుధ్య కార్మికులు, డాక్టర్లు, పోలీసులు(యోధులు) అందిస్తున్న సేవలకు వెలకట్టలేమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్‌బీకాలనీ వార్డు కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్‌ శ్రీనివాసరావు, మూసాపేట సర్కిల్‌ ఉప కమిషనర్‌ కె.రవికుమార్‌ ప్రభుత్వం అందజేసిన కిట్లను వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో సకల వసతులు కల్పించి కరోనా రోగులకు ఉచితం గా చికిత్సను అందించడంతో పాటు హోంఐసొలేషన్‌లో ఉన్న వారికి ప్రభుత్వం మందులు, శానిటైజర్లతో కూడిన కిట్లను పంపిణీ చేస్తుందన్నారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో ఏఎంహెచ్‌వో సంపత్‌కుమార్‌, ఎస్‌ఎస్‌ మురళీధర్‌రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఏలు మహంకాళి సూర్యనారాయణ, నర్సింహ, స్థానిక నేతలు పాల్గొన్నారు.

కుల సంఘాలకు చేయూత 

బాలానగర్‌: సొంత నిధులతో కుల సంఘాలకు ఓల్డ్‌బోయిన్‌పల్లి కార్పొరేటర్‌ ముద్దం నర్సింహయాదవ్‌ చేయూత అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్‌బోయిన్‌పల్లి డివిజన్‌లో గంగపుత్ర భవనాన్ని కార్పొరేటర్‌ నర్సింహయాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సింహయాదవ్‌ తండ్రి శంకరయ్యయాదవ్‌ జ్ఞాపకార్థం గంగపుత్ర సంఘానికి స్థలం కేటాయించడం, నిర్మాణ పనులకు సహకరించడం ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో సికిద్రాబాద్‌ డివిజన్‌ రైల్వేబోర్డు సభ్యుడు జంగయ్య, గంగపుత్రులు, స్థానికులు పాల్గొన్నారు.

పోచమ్మ అమ్మవారి ఆలయ 

పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన

కూకట్‌పల్లి డివిజన్‌ పరిధి ప్రకాశ్‌నగర్‌లో పోచమ్మ ఆల య పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవ జీవనానికి ఆధ్యాత్మికత  అవసరమేనని పేర్కొన్నారు. అంతేకాకుండా స్థానికులందరూ ఐక్యతను ప్రదర్శించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు తదితరులు పాల్గొన్నారు.