సోమవారం 03 ఆగస్టు 2020
Hyderabad - Jul 09, 2020 , 00:18:40

అరగంటలో ఫలితం

అరగంటలో  ఫలితం

ఇక వేగంగా కరోనా నిర్ధారణ

మొత్తం 90 కేంద్రాల్లో టెస్టులు

లక్షణాలు, హైరిస్క్‌ వారికి ఉపశమనం

యాంటిజెన్‌ పరీక్షలతో నమూనా సేకరించిన 

అరగంటలోనే కరోనా ఫలితం తేలుతుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న పీసీఆర్‌ పరీక్షల ద్వారా జాప్యం జరుగుతుండటంతో కొవిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.  మూడు జిల్లాల్లోని 90 కేంద్రాల్లో ఈ పరీక్షలు చేపడుతున్నది. దీంతో నమూనాలు ఇచ్చిన అనుమానితులకు ఉపశమనం లభిస్తుంది. కొవిడ్‌ లక్షణాలు, హైరిస్క్‌ రోగులు, గర్భిణులకు మాత్రమే ఈ పరీక్షలు చేస్తారు.   -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

కరోనా వైరస్‌తో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పరీక్షలు జరిపిన 30నిమిషాల్లోనే రిపోర్టులు వచ్చేలా చర్యలు చేపట్టింది. గ్రేటర్‌ వ్యాప్తంగా(జీహెచ్‌ఎంసీ, మేడ్చల్‌, రంగారెడ్డి) 90 కేంద్రాల్లో కొవిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బుధవారం జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల పరిధిలోని సుమారు 500మందికి కొవిడ్‌ యాంటిజెన్‌ 

పరీక్షలు నిర్వహించారు. వీరిలో రంగారెడ్డి జిల్లా పరిధిలో 162మందికి, మేడ్చల్‌ పరిధిలో 11మందికి పాజిటివ్‌ 

వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 

లక్షణాలున్న వారికి, హైరిస్క్‌ కేసులకే పరీక్షలు

ఇన్‌ఫ్లుయంజా లైక్‌ ఇల్‌నెస్‌(ఐఎల్‌ఐ), సివియర్‌ ఎక్యూట్‌ రెస్పిరేటరీ ట్రాక్‌ ఇన్‌ఫెక్షన్‌(సారి)తో పాటు గర్భిణులు, గుండె, కాలెయ, కిడ్నీ, క్యాన్సర్‌, హెచ్‌ఐవీ తదితర హైరిస్క్‌ కేసులకు యాంటిజెన్‌ పద్ధతిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

 ‘ఐఎల్‌ఐ’ అంటే జలుబు, దగ్గు, తుమ్ములు వంటి స్వల్ప లక్షణాలు గలవారు 

‘సారి’ అంటే ఆయాసం, శ్వాస సమస్య, తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు తదితర తీవ్రమైన లక్షణాలు గలవారు

సిటీబ్యూరో-నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ పరిధిలో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం పరీక్షలను మరింత వేగవంతం చేసింది. ఫలితాలు అరగంటలోపే వెల్లడించే విధంగా చర్యలు చేపట్టింది. కేసుల పెరుగుదలతో ప్రస్తుతం ఫలితాలు రావడానికి మూడు నుంచి నాలుగురోజుల సమయం పడుతున్న నేపథ్యంలో కొవిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ ఈ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గ్రేటర్‌ పరిధిలో మొత్తం 90 కేంద్రాల్లో కొవిడ్‌ యాంటిజెన్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పీసీఆర్‌ పరీక్షల ద్వారా ఫలితాల వెల్లడిలో జరుగుతున్న జాప్యం వల్ల లక్షణాలు తీవ్రంగా ఉన్న రోగులు ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలిసిందే. ఫలితాలు వచ్చే వరకు నమూనాలు ఇచ్చిన అనుమానిత రోగుల్లో పట్టరాని టెన్షన్‌ నెలకొంటుంది. ఇది చాలామందిని మానసిక ఒత్తిడికి సైతం గురిచేస్తున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా లక్షణాలు తీవ్రంగా ఉన్న వారి విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులు, పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యాంటిజెన్‌ పరీక్షల ద్వారా కేవలం 30నిమిషాల్లోనే వైరస్‌ నిర్ధారణ జరుగడంతో రోగులకు వెంటనే చికిత్స అందించే వీలుంటుందని వైద్యాధికారులు తెలిపారు. 

గ్రేటర్‌ పరిధిలో 90 కేంద్రాలు

గ్రేటర్‌ పరిధిలో మొత్తం 90 కేంద్రాల్లో కొవిడ్‌ యాంటిజన్‌ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 50పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని 20, మేడ్చల్‌ జిల్లా పరిధిలోని 20 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్‌ యాంటిజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 

హైదరాబాద్‌ జిల్లాలోని కేంద్రాలివే..

నాంపల్లి, పన్నీపురా, గోల్కొండ, కింగ్‌కోఠి, అమీర్‌పేట్‌, బార్కాస్‌, డబీర్‌పురా, మలక్‌పేట్‌, అంబర్‌పేట్‌, శ్రీరాంనగర్‌, సీతాఫల్‌మండి, లాలాపేట, జంగమ్మెట్‌, సురాజ్‌భాన్‌ యూహెచ్‌ఎన్‌సీల పరిధిలోని

ఈ కింది పీహెచ్‌సీలలో..

సయ్యద్‌నగర్‌, చింతల్‌బస్తీ , అఫ్జల్‌సాగర్‌, నిలోఫర్‌, ఆగాపురా, పురానాపూల్‌, పన్నీపురా, కార్వాన్‌-2, దూద్‌బౌలి, బేగంబజార్‌, కుమ్మర్‌వాడీ, గుడిమల్కాపూర్‌, కార్వాన్‌-1, గగన్‌మహల్‌, డీబీఆర్‌మిల్స్‌, బొగ్గులకుంట, ఇసామియాబజార్‌, అమీర్‌పేట్‌, సనత్‌నగర్‌, బండ్లగూడ, మైసారం, పార్వతీనగర్‌, ఉప్పుగూడ, తీగలకుంట, జహనుమా, చార్మినార్‌, ఈది బజార్‌, అమన్‌నగర్‌, పన్‌జెషా-1, ఆజంపురా, డబీర్‌పురా, యాకుత్‌పురా-2, దారుల్‌షిఫా, మాదన్నపేట్‌, శాలివాహననగర్‌, మలక్‌పేట్‌, బాగ్‌అంబర్‌పేట్‌, భోలక్‌పూర్‌, హర్రాజ్‌పేట, తిలక్‌నగర్‌, బోరబండ, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, బోయిగూడ, చుట్టాల్‌బస్తీ, మహ్మద్‌గూడ, తుకారాంగేట్‌, అడ్డగుట్ట, గరీబ్‌నగర్‌, కంటోన్మెంట్‌ (బోయిన్‌పల్లి)

గాంధీ వైద్యులకు రుణపడి ఉంటాం

ప్రైవేటు దవాఖానలో తనకు సరైన వైద్యం అందలేదని గాంధీవైద్యులు అక్కున చేర్చుకుని ఆదుకున్నారని చాంద్రాయణగుట్ట వాసి మహ్మద్‌ ఖలీల్‌ తెలిపారు. ఖలీల్‌ అతడి తండ్రి వైరస్‌ బారిన పడి స్థానిక ప్రైవేటు దవాఖానలో చేరినా అక్కడ సరైన వైద్యం లభించలేదు. దీంతో పలువురి సూచన మేరకు గాంధీకి వెళ్లగా అక్కడ వారం రోజుల్లోనే పూర్తిగా కోలుకున్నారు. అక్కడి వైద్యుల ప్రత్యేక కృషితోనే ఇది సాధ్యమైందని ఖలీల్‌ సంతోషం వ్యక్తం చేస్తూ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

రంగారెడ్డి జిల్లాలో..

సరూర్‌నగర్‌, బాలాపూర్‌, అబ్ధూల్లాపూర్‌మెట్‌, రంగనాయక్‌లకుంట, మన్సూరాబాద్‌, శివరాంపల్లి, హసన్‌నగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, హఫీజ్‌పేట్‌, ఉప్పర్‌పల్లి, రాయదుర్గం, నందివనం, శేరిలింగంపల్లి, నార్సింగి, కందుకూరు, మొయినాబాద్‌, కొందుర్గు, ఆమనగల్లు, యాచారం, కొత్తూరు.

మేడ్చల్‌ జిల్లాలో..

మల్కాజిగిరి, పీర్జాదిగూడ, సూరారంకాలనీ, దుండిగల్‌, కుషాయిగూడ, బాలానగర్‌, మూసాపేట, కూకట్‌పల్లి, జగద్గిరిగుట్ట, ఉప్పల్‌, వీఆర్‌నగర్‌, అల్వాల్‌, బోడుప్పల్‌, కుత్బుల్లాపూర్‌, షాపూర్‌నగర్‌, మౌలాలి, వైబండ, నాగోల్‌, మల్లాపూర్‌, గాజులరామారం.

యూసుఫ్‌గూడలో 38మందికి..

వెంగళరావునగర్‌: జీహెచ్‌ఎంసీ యూసుఫ్‌గూడ సర్కిల్‌-19 పరిధిలో 38మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఉప కమిషనర్‌ రమేశ్‌ తెలిపారు. యూసుఫ్‌గూడ డివిజన్‌లో 18, బోరబండలో 7, రహ్మత్‌నగర్‌లో 6, ఎర్రగడ్డలో 4, వెంగళరావునగర్‌లో 3 కేసులు నమోదైనట్లు తెలిపారు. 

బాలాపూర్‌లో 24 మందికి..

బడంగ్‌పేట: బాలాపూర్‌ మండల పరిధిలో బుధవారం 24మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. బడంగ్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 14మందికి, మీర్‌పేట మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 10 మందికి వైరస్‌ సోకినట్లు వైద్యాధికారులు గోవింద్‌రెడ్డి, నర్సింగ్‌రావు తెలిపారు. అల్మాస్‌గూడలో ఒకే ఇంట్లోనే ఆరుగురికి కరోనా సోకినట్లు పేర్కొన్నారు.

ఖైరతాబాద్‌లో 20 మందికి..

ఖైరతాబాద్‌ : ఖైరతాబాద్‌ సర్కిల్‌లో బుధవారం 20మందికి పాజిటివ్‌ వచ్చింది. ఖైరతాబాద్‌లో 8, సోమాజిగూడలో 3, అమీర్‌పేటలో 7, సనత్‌నగర్‌లో 2 కేసులు వచ్చాయి. గాంధీనగర్‌కు చెందిన వృద్ధురాలు(71)చికిత్స పొందుతూ మృతిచెందింది.

బండ్లగూడ: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో 18మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

అంబర్‌పేట: అంబర్‌పేట నియోజకవర్గంలో  18 పాజిటివ్‌ కేసులు వచ్చాయి.

హిమాయత్‌నగర్‌ : హిమాయత్‌నగర్‌ డివిజన్‌లో 16మందికి పాజిటివ్‌ వచ్చింది. 

రామంతాపూర్‌: ఉప్పల్‌ ఆరోగ్య కేంద్రం పరిధిలోని హబ్సిగూడ, రామంతాపూర్‌, ఉప్పల్‌, చిలుకానగర్‌ డివిజన్లలో బుధవారం 16కేసులు నమోదైనట్లు ఉప్పల్‌ ఆరోగ్యకేంద్రం అధికారి తెలిపారు. 

బషీర్‌బాగ్‌: ముషీరాబాద్‌ నియోజకవర్గంలో బుధవారం 14 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. భోలక్‌పూర్‌ గంగపుత్ర కాలనీలో వృద్ధురాలు(65) మృతి చెందినట్లు వైద్యాధికారి తెలిపారు. 

దుండిగల్‌: కుత్బుల్లాపూర్‌లో బుధవారం 13మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నిజాంపేట బాలాజీ ఆదర్శ ఎన్‌క్లేవ్‌లో ఆరుగురికి, చింతల్‌ బాపూనగర్‌, జగద్గిరిగుట్ట, సూరారంలో పలువురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు. 

బాలానగర్‌: కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో ఏడు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యాధికారి చందర్‌ తెలిపారు. 

కాప్రా: కాప్రాసర్కిల్‌లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 

బోడుప్పల్‌: బోడుప్పల్‌ నగరపాలక సంస్థ పరిధిలో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

మెహిదీపట్నం: ఆసిఫ్‌నగర్‌ పీఎస్‌ పరిధిలో బుధవారం 11కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

మేడ్చల్‌ రూరల్‌ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మున్సిపాలిటీ పరిధిలోని ప్రెస్టేజ్‌పార్కులో నివాసముంటున్న తండ్రి(45), కొడుకు(22)కు వైరస్‌ సోకినట్లు మండల వైద్యాధికారి తెలిపారు.

జియాగూడ : కుల్సుంపురా పీఎస్‌కు చెందిన ఓ హెడ్‌ కానిస్టేబుల్‌(47) కరోనాతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.

శామీర్‌పేట: శామీర్‌పేటకు చెందిన వ్యక్తి (48) చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

గోల్నాక : బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు, సీనియర్‌ నాయకుడు(69) చికిత్సపొందుతూ బుధవారం మృతి చెందాడు. 

తెలుగుయూనివర్సిటీ: నిలోఫర్‌ దవాఖానలోని ఐసోలేషన్‌ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారికి(10), ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన చిన్నారికి(8), నర్సాపూర్‌ మండలం కాగజ్‌మద్దూర్‌కు చెందిన గర్భిణికి(25) పాజిటివ్‌ వచ్చింది. దవాఖానలో పనిచేస్తూ.. రాంనగర్‌లో ఉండే ఉద్యోగినికి(31), చాంద్రాయణగుట్టలో ఉండే డాక్టర్‌కు(25), రెడ్‌హిల్స్‌లో ఉండే ప్రొఫెసర్‌ స్థాయి డాక్టర్‌కు(52), సంతోష్‌నగర్‌లో ఉండే డాక్టర్‌ కుటుంబసభ్యుడికి (25)వైరస్‌ సోకింది.


logo