ఆదివారం 09 ఆగస్టు 2020
Hyderabad - Jul 15, 2020 , 22:41:56

లీజు రద్దయినా కొనసాగిస్తున్నారు

లీజు రద్దయినా కొనసాగిస్తున్నారు

ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలంటూ ఎమ్మెల్యేకు వినతి

చిక్కడపల్లి : ఆజామాబాద్‌ పారిశ్రామికవాడలో భూ అక్రమార్కుల చేతిలోనుంచి విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని బాగ్‌లింగంపల్లి వాసి టీఆర్‌ఎస్‌ నాయకుడు సీ కుమార్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌కు విన్నవించాడు. గాంధీనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చాడు. ఈ సందర్భంగా కుమార్‌ మాట్లాడుతూ ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌ నుంచి నాగమయ్యకుంట వరకు రోడ్డుకు ఇరువైపులా ఆజామాబాద్‌ పారిశ్రామికవాడ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుకు అప్పటి నిజాం ప్రభుత్వం 150 ఎకరాలను లీజుకు ఇచ్చిందన్నారు. కాగా లీజు రద్దయినప్పటికీ ఆయా పరిశ్రమల యజమానులు ప్రభుత్వానికి అప్పగించడం లేదన్నారు.  


logo