ఈ నాటి కాలం అందాల భామలు శరీర సౌష్టవంపై ఎంతగా శ్రద్ధ పెడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జిమ్‌లలో చెమటలు కారేలా వర్కవుట్స్ చేయడమే కాకుండా, డైట్ విషయంలో కండీషన్స్ పెట్టుకొని స్లిమ్ లుక్‌లో కనిపిస్తున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే సమంత, రకుల్, మంచు లక్ష్మీ వంటి స్టార్స్ తరచుగా తమ సోషల్ మీడియాలో వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటారు.
తాజాగా అక్కినేని కోడలు సమంత తన సోషల్ మీడియా పేజ్‌లో వర్కవుట్కు సంబంధించిన పిక్ షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది.. తల కిందకు కాళ్లు పైకి పెట్టి తాడు సాయంతో ఆసనం వేసింది.ఆ ఆసనానికి సంబంధించిన ఫొటో షేర్ చేస్తూ దీనికి లైఫ్ అనేది హోల్డ్ చేస్తూ వదిలేది అనే క్యాప్షన్ ఇచ్చింది. సమంత ఫొటో నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడు గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. పాన్ ఇండియన్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతకి జంటగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించబోతున్నాడు.