గురువారం 04 మార్చి 2021
Hyderabad - Aug 03, 2020 , 00:01:29

వరద వదిలేలాలేదు

వరద వదిలేలాలేదు

చిన్నపాటి వర్షానికే ఇండ్లల్లోకి వచ్చి చేరుతున్న వర్షపునీరు

కొన్నిచోట్లే సాఫీగా వెళ్తున్న నీరు

మరికొన్ని చోట్ల పైపులైన్లు ఏర్పాటు చేయాలంటున్న స్థానికులు

 చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు..వరద ముంపు తప్పడం లేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. రోడ్లన్నీ వరదనీటితో నిండిపోతున్నాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతున్నది. కొన్ని చోట్ల వరదనీటి పైపులైన్లు మట్టితో నిండిపోయాయి..మరికొన్ని చోట్ల మొత్తానికే ఏర్పాటు చేయలేదు. ఫలితంగా కొన్నేండ్లుగా మోండా డివిజన్‌ వాసులు పడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మొర పెట్టుకుంటున్నారు. 

మారేడ్‌పల్లి :  మోండా డివిజన్‌లో వరద నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించటం లేదు. వర్షాకాలంలో చిన్నపాటి వర్షం పడితే డివిజన్‌లోని రెజిమెంటల్‌బజార్‌, 31వ బస్టాండ్‌, నాలాబజార్‌, మనోహర్‌ థియేటర్‌, సంతోషిమాత ఆలయం తదితర ప్రా ంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరి ఇండ్లల్లోకి ప్రవేశిస్తున్నది. అయితే వరదనీటి పైపులైన్‌ నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో వరద నీరు సాఫీగా వెళ్తున్నదితతతతతss. నిర్మాణాలు చేపట్టని చోట తరుచూ ముంపు సమస్య తలెత్తుతున్నది. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి అవసరం ఉన్న చోట వరదనీటి పైపులైన్‌ నిర్మాణాలు చేపట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆయా పరిసర ప్రాంత ప్రజలు, వాహనదారులు వేడుకుంటున్నారు. 

 సమస్య పరిష్కారానికి చర్యలు ..

మోండా డివిజన్‌లో వరద ముంపు సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. సూమారు రూ.3 కోట్లతో సికింద్రాబాద్‌ 31వ బస్టాండ్‌ నుంచి నాలా బజార్‌ వరకు నాలా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో వరద నీరు నిలుస్తున్నదని, ఆ సమస్యను పరిష్కరిస్తాం. వర్షం పడిన సమయాల్లో జీహెచ్‌ఎంసీ సిబ్బంది వరదనీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. 

- ఆకుల రూప,  

కార్పొరేటర్‌

VIDEOS

logo