మంగళవారం 27 అక్టోబర్ 2020
Hyderabad - Sep 07, 2020 , 01:46:32

ఫ్రంట్‌ వారియర్స్‌ కృషి ప్రశంసనీయం

 ఫ్రంట్‌ వారియర్స్‌ కృషి ప్రశంసనీయం

 అబిడ్స్‌ : కరోనా నేపథ్యంలో ఫ్రంట్‌ వారియర్స్‌ చేస్తున్న కృషి ప్రశంసనీయమని గోషామహల్‌ ఎమ్మెల్యే టి.రాజాసింగ్‌ అన్నారు. గన్‌ఫౌండ్రి డివిజన్‌ బీజేపీ యువసేన అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ ఆధ్వర్యంలో గన్‌ఫౌండ్రిలో ఏర్పాటు చేసిన ఫ్రంట్‌ వారియర్స్‌ సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితులలో ముందుండి విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య సిబ్బంది, పోలీస్‌, మీడియా ప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బందిని అభినందించారు. అనంతరం వారిని సన్మానించారు.  ఈ కార్యక్రమంలో  విజయ్‌ సింగ్‌, రాజు, సిద్దార్థ, పి.నందరాజ్‌, రాజన్‌ జైస్వాల్‌, టింకా  పాల్గొన్నారు. logo