శుక్రవారం 22 జనవరి 2021
Hyderabad - Dec 06, 2020 , 05:53:47

కోర్టులు జోక్యం చేసుకునేందుకు అవకాశం లేదు

కోర్టులు జోక్యం చేసుకునేందుకు  అవకాశం లేదు

  •   హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘం వాదన

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: స్వస్తిక్‌ కాకుండా ఇతర ముద్రలున్న ఓట్లను పక్కనపెట్టాలన్న సింగిల్‌ జడ్జి తీర్పుపై తక్షణం జోక్యం చేసుకోవడానికి హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది. సింగిల్‌ జడ్జి తుది ఉత్తర్వులు జారీచేసిన తర్వాత అప్పీల్‌ను పరిశీలిస్తామని పేర్కొన్నది. స్వస్తిక్‌యేతర ముద్ర కలిగిన ఓట్లకు సంబంధించి ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) శనివారం హౌజ్‌మోషన్‌ రూపంలో అప్పీల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

ఎస్‌ఈసీ తరఫున సీనియర్‌ న్యాయవాది  విద్యాసాగర్‌ వాదనలు వినిపిస్తూ.. ఏకసభ్య ధర్మాసనం తీర్పు వల్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేరేడ్‌మెట్‌ ఎన్నికల ఫలితం ఆగిపోయిందని తెలిపారు. ఆర్టికల్‌ 243 (జెడ్‌జీ) ప్రకారం ఒక్కసారి ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదని ధర్మాసనానికి నివేదించారు. పలు సుప్రీంకోర్టు తీర్పులు సైతం ఇదే అంశాన్ని ధ్రువీకరిస్తున్నాయని పేర్కొన్నారు. వాదనలు నమోదు చేసిన ధర్మాసనం.. సింగిల్‌ జడ్జి వద్ద సోమవారమే విచారణ ఉన్నందున అప్పటి వరకు వేచి ఉండాలని తెలిపింది. తుది తీర్పు తర్వాత అభ్యంతరాలుంటే అప్పీల్‌ చేసుకోవచ్చని సూచించింది.  


logo