బుధవారం 12 ఆగస్టు 2020
Hyderabad - Jul 07, 2020 , 23:04:13

అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలి: ఎమ్మెల్యే గోపీనాథ్‌

అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలి: ఎమ్మెల్యే గోపీనాథ్‌

ఎర్రగడ్డ : అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అన్నారు. రహ్మత్‌నగర్‌ డివిజన్‌ ఎస్పీఆర్‌ హిల్స్‌లోని టి.అంజయ్యనగర్‌ బస్తీలో మంగళవారం సీసీరోడ్డు పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన అందరికీ దక్కేలా సహకరిస్తానన్నారు. గతంలో కనీస సౌకర్యాలు లేక బస్తీలవాసులు నానా అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధికి నిధుల విషయంలో పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రారంభించిన సీసీ రోడ్డు పనులకు రూ.13లక్షలు కేటాయించామని తెలిపారు. హిల్స్‌లోని ఇతర బస్తీల్లో కూడా మిగిలిన పనులకు త్వరలో శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి షరీఫ్‌, సీనియర్‌ నేతలు సీఎన్‌ రెడ్డి, లియాఖత్‌అలీ, అరుణ్‌, ముబీన్‌, మన్సూర్‌, సుబ్బరాజు, గఫార్‌, శ్రీనివాస్‌, నర్సింహ, రమేశ్‌ పాల్గొన్నారు.


logo