శనివారం 23 జనవరి 2021
Hyderabad - Dec 06, 2020 , 06:04:41

నగర ఓటర్లకు ధన్యవాదాలు

నగర ఓటర్లకు ధన్యవాదాలు

  •  మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓట్లు వేసి టీఆర్‌ఎస్‌ పార్టీని ఆశీర్వదించిన ఓటర్లందరికీ రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 


జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో విజయకేతనం ఎగురవేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్పొరేటర్‌ అభ్యర్థులు ఎమ్మెల్సీ శంబీపూర్‌ రాజు, ఎమ్మె ల్యే కేపీవీ వివేకానంద్‌గౌడ్‌తో కలిసి మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తొలుత కార్పొరేటర్లుగా విజయం సాధించిన అభ్యర్థులకు మంత్రి అభినందనలు తెలిపారు. logo