e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home హైదరాబాద్‌ కళాకృతుల కనువిందు!

కళాకృతుల కనువిందు!

  • అమితంగా ఆకర్షిస్తున్న ఆకృతి వస్త్ర ఎగ్జిబిషన్‌
  • సీసీటీ ఆధ్వర్యంలోబంజారాహిల్స్‌లో ఏర్పాటు
  • ఈ నెల 30 వరకు ప్రదర్శన

చేనేత, హస్తకళా ప్రదర్శన మహిళలను విశేషంగా ఆకట్టుకుంటున్నది. కుల వృత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ ఆకృతి వస్త్ర-2021 పేరుతో
ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ నెల 30 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శన బుధవారం బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12లోని సీసీటీ భవనంలో ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్‌లో మొదటి రోజు వందల కొద్ది డిజైన్‌ వస్ర్తాలు కొలువు దీరగా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిని కొనుగోలు చేసేందుకు మహిళలు ఆసక్తి చూపారు. ఇందుకు తగ్గట్టుగానే హాండ్లూమ్‌, ఫాబ్రిక్స్‌తో పాటు ట్రెడిషనల్‌, మోడ్రన్‌ కలెక్షన్స్‌ను డిజైనర్లు అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శన వృద్ధులతో పాటు యువతను అమితంగా ఆకర్షిస్తున్నది.

పెయింటింగ్స్‌, చేనేత వస్ర్తాలు, చేతితో అల్లిన బుట్టలు, ఎకో ఫ్రెండ్లీ చాపలు, హ్యాండ్‌ మేడ్‌ చీరలు, డ్రెస్‌లు, ఆభరణాలు, ఇంటీరియర్‌, హోం డెకరేషన్‌.. ఇలా మహిళలు మనసు దోచే ఎన్నో వస్తువులను ఈ ప్రదర్శన ద్వారా అందుబాటులోకి తెచ్చారు. చేనేత వస్ర్తాలతో పాటు ఇయర్‌ రింగ్‌, నెక్లెస్‌, థ్రెడ్‌ బ్యాంగిల్స్‌, ఎకో ఫ్రెండ్లీ నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హాండ్‌క్రాఫ్ట్‌ కలెక్షన్స్‌, వాల్‌ హాంగింగ్స్‌, డిజైనర్‌ ల్యాంప్స్‌తో పాటు చెక్కతో తయారు చేసిన అనేక వస్తువులు ఉన్నాయి. నిజాం నవాబుల కాలంలో ఉపయోగించిన గృహోపకరణాలు, అలంకరణ వస్తువులు, చార్మినార్‌ బొమ్మలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 21 చేనేత వస్త్ర, 20 హస్త కళలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి. మన రాష్ర్టానికి ప్రతీకగా నిలిచే పోచంపల్లి, సిద్దిపేట గొల్లభామ చీరలు, వరంగల్‌కు చెందిన ప్యూర్‌ కాటన్‌ బెడ్‌షీట్లు, డోర్‌మ్యాట్లు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.

హస్తకళలను ప్రోత్సహించడమే లక్ష్యం..

- Advertisement -

చేనేత, హస్త కళలపై ఆధారపడి జీవిస్తున్న వారిని ప్రోత్సహించేందుకు క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ కృషి చేస్తున్నది. అన్నీ ఒకే చోట లభించడం, మహిళలకు అవసరమైన చేనేత, హస్తకళా వస్తువులన్నీ ఒకే చోట లభించేలా సీసీటీ వేదిక కావడంతో వృత్తిదారులు, కొనుగోలుదారుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. ఆకృతి వస్త్ర పేరుతో ఏర్పాటు చేసిన టెక్ట్స్‌టైల్‌ అండ్‌ క్రాఫ్ట్‌ ఎగ్జిబిషన్‌లో దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన హాండ్లూమ్‌ కలెక్షన్స్‌, హాండీక్రాఫ్ట్స్‌ను ప్రదర్శనలో ఉంచాం. – ఉషా సర్వారాయులు, క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ చైర్మన్‌

ఇతర రాష్ర్టాల వారికి అవకాశం..

వ్యవసాయం తర్వాత చేనేత, హస్తకళలను నమ్ముకొని ఎక్కువ జీవిస్తున్న వారిని ప్రోత్సహించేందుకే ఈ ప్రదర్శన చేపట్టాం. సీసీటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం రెండుసార్లు ఈ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేస్తున్నాం. వృత్తిదారులకు ఆర్థిక సహాయం, మార్కెటింగ్‌ స్కిల్స్‌ను పెంచే విధంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను చేపడుతున్నాం. నాణ్యత, ధర అన్నీ చూసిన తర్వాతే ఎగ్జిబిట్లను ఎంపిక చేశాం. తెలుగు రాష్ర్టాల వారినే కాకుండా ఇతర రాష్ర్టాల వారికి ఈ ప్రదర్శనలో అవకాశం కల్పించాం. – సీతారంజిత్‌రెడ్డి, క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ సభ్యురాలు

మా నాన్నపేరుతో స్టాల్‌ పెట్టాం

మా నాన్న చేనేత కార్మికుడు. ఇటీవలే ఆయన మరణించారు. ఎన్నో ఇబ్బందులు పడుతుండగా మా పరిస్థితి గమనించిన సీసీటీ వారు ఈ ఎగ్జిబిషన్‌లో ఉచితంగా స్టాల్‌ పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చారు. కరోనా పరిస్థితుల్లో మమ్మల్ని ప్రోత్సహించడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ నాన్న పేరుతోనే స్టాల్‌ ఏర్పాటు చేశాం. చీరలు, చేనేత వస్ర్తాలు ఇక్కడ విక్రయిస్తున్నాం. – చందన, కొయ్యలగూడెం, నల్లగొండ

ఎలాంటి రుసుం తీసుకోలేదు..

మాది చేనేత కుటుంబం. కాటన్‌ బెడ్‌షీట్లు, డోర్‌ మ్యాట్లు, జంఖానాలను ఈ ప్రదర్శనలో పెట్టాం. సీసీటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ ద్వారా అమ్మకాలు బాగున్నాయి. ఇక్కడ స్టాల్‌ ఏర్పాటు చేసేందుకు ఎలాంటి రుసుం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో చేనేత కార్మికులను ప్రోత్సహించడం ఆనందంగా ఉంది. -కిరణ్‌కుమార్‌, వరంగల్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana