గురువారం 29 అక్టోబర్ 2020
Hyderabad - Sep 26, 2020 , 00:55:23

పదోన్నతులపై సానుకూలం హర్షం వ్యక్తం చేసిన ‘టెట్‌' నూతన కార్యవర్గం

పదోన్నతులపై సానుకూలం హర్షం వ్యక్తం చేసిన ‘టెట్‌' నూతన కార్యవర్గం

అహ్మద్‌నగర్‌: ఉపాధి , శిక్షణ శాఖలో పదోన్నతులపై ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందిచడంపై ‘టెట్‌' కార్యవర్గం హర్షం వ్యక్తం చేసింది. శుక్రవారం స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాణి కుముదినీతో వర్చువల్‌ మీటింగ్‌లో పాల్గొన్నారు.  తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ సంచాలకుడు కె.వై. నాయక్‌ ,  సంయుక్త సంచాలకులు ఎస్‌.వి.కె .నగేశ్‌, సహాయ సంచాలకులు ఎస్‌. రాజా, ప్రాంతీయ సహాయ సంచాలకులు నర్స య్య , కె.వి. చంద్రశేఖర్‌ను ‘టెట్‌' నూతన కార్యవర్గం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ , హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఎంబీ కృష్ణా యాద వ్‌, తెలంగాణ రాష్ట్ర ఉపాధి శిక్షణ శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడు  శ్రీనివాసరావు , ప్రధాన కార్యదర్శి బి.సీతారాములు, కోశాధికారి వెంకటేశ్వరరావు, అధికారులు సురేందర్‌, వేణు, ప్రభాకర్‌, రమేశ్‌కుమార్‌, శ్రీనివాసులు, నరేంద్రబాబు, దేవానంద్‌, సుజాత పాల్గొన్నారు.


logo