గురువారం 28 జనవరి 2021
Hyderabad - Sep 21, 2020 , 00:46:34

పది గంటలకు పది నిమిషాలు ..

పది గంటలకు పది నిమిషాలు ..

  అడ్డగుట్ట : పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు జరుగుతున్న పది గంటలకు పది నిమిషాల కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఆదివారం తుకారాంగేట్‌లో టీఆర్‌ఎస్‌ వార్డు సభ్యులు పీఎల్‌. ప్రవీణ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు, స్థానిక ప్రజల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరిసరాలను శుభ్రం చేయించడంతో పాటు ఇంటింటికీ తిరిగి పరిసరాల పరిశుభ్రతకు పాటుపడాలని సూచించారు.  టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రవీణ్‌కుమార్‌, మనోజ్‌, సుధీర్‌, వసంత, కల్యాణి, జీహెచ్‌ఎంసీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


logo