మంగళవారం 19 జనవరి 2021
Hyderabad - May 31, 2020 , 02:19:28

శాంతించిన భానుడు

శాంతించిన భానుడు

హైదరాబాద్ : ఉపరితల ఆవర్తనం, క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతో గ్రేటర్‌ పరిధిలో భానుడు కాస్త శాంతించాడు. రెండ్రోజులుగా సిటీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం కొంత చల్లబడింది. శనివారం మాత్రం ఉదయం 11గంటల వరకు ఎండ తీవ్రత పెద్దగా కనిపించలేదు. దీనికి తోడు గాలిలో తేమ శాతం కూడా పెరిగింది.  ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 39.7, కనిష్ఠ 29.2 డిగ్రీలుగా, గాలిలో తేమ 30 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.