రవీంద్రభారతి, ఆగస్టు 1: తెలంగాణ థియేటర్, మీడియా రిపర్టరీ నిర్వహిస్తున్న మూడవ శిక్షణ శిబిరం గోడ పత్రికను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహిస్తున్న ఈ శిబిరం ద్వారా వాయిస్, యాక్టింగ్, డబ్బింగ్, వాయిస్ ఓవర్పై 30 రోజులు ఆన్లైన్లో, 15 రోజులు స్టూడియోలో ప్రాక్టికల్స్ ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ థియేటర్, మీడియా రిపర్టరీ అధ్యక్షుడు రమేష్ గౌడ్ తెలిపారు. ఆసక్తి గల వారు ఈ నెల 10న తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 7396817623 నంబర్లో సంప్రదించవచ్చన్నారు. కార్యక్రమంలో రచయిత బి.అజయ్, నటుడు ప్రదీప్ పాల్గొన్నారు.