సోమవారం 06 జూలై 2020
Hyderabad - May 30, 2020 , 03:41:12

తెలంగాణ సోషల్‌ సర్వీస్‌ పేరుతో మోసం

తెలంగాణ సోషల్‌ సర్వీస్‌ పేరుతో మోసం

హైదరాబాద్  : ‘తెలంగాణ సోషల్‌ సర్వీస్‌లో నూతన కమిటీ వేస్తున్నాం.. పదవులు ఇస్తాం’ అంటూ నమ్మిం చి 102 మంది నుంచి సుమారు రూ. 2 లక్షల 35వేల నగదును వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిపై సుల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితులు.. పోలీసులు తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గం ఎడపల్లి మండలం అంబం గ్రామానికి చెందిన పవన్‌కుమార్‌ తెలంగాణ సోషల్‌ సర్వీస్‌ రాష్ట్ర అధ్యక్షుడినని గోషామహల్‌ నియోజకవర్గం సుల్తాన్‌బజార్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ మహిళా నాయకురాలు శీలం సరస్వతికి ఏప్రిల్‌ మాసంలో ఫోన్‌ చేశాడు. 

తెలంగాణ సోషల్‌ సర్వీస్‌లో నూతన కమిటీ వేస్తున్నాం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా పదవి ఇస్తామని ఆశ జూపాడు. టీఆర్‌ఎస్‌కు చెందిన నాయకుల పేరును ప్రస్తావించడంతో ఆమె తన మహిళా బృందం(102 మంది) ఒక్కొక్కరు రూ. 2-3 వేల దాకా పవన్‌కుమార్‌కు గూగుల్‌ పే ద్వారా నగదు పంపించారు. కాగా తెలంగాణ సోషల్‌ సర్వీస్‌ పేరిట ఓ ఫేక్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయడంతో శీలం సరస్వతి హోంమంత్రి మహమూద్‌ అలీ, నగర పోలీస్‌ కమిషనర్‌, సుల్తాన్‌బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుల్తాన్‌బజార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు వెళ్లినట్లు సమాచారం.


logo