కావలసిన పదార్థాలు: కొత్తిమీర: రెండు కట్టలు, క్యారెట్: రెండు, పచ్చిమిర్చి: రెండు, అల్లం: చిన్నముక్క, ఉల్లిపాయ: ఒకటి, నిమ్మకాయ: ఒకటి, కొబ్బరి పాలు: అర కప్పు, ఉప్పు: తగినంత, లెమన్ గ్రాస్ స్టాక్: ఒక కప్పు, ఉల్లికాడలు: అర కప్పు.
తయారీ విధానం: కొత్తిమీరను శుభ్రంగా కడిగి, తరిగి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉల్లికాడలను చిన్నగా తరగాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, లెమన్ గ్రాస్ స్టాక్, కొబ్బరి పాలు, ఒక కప్పు నీళ్లు పోసి చిన్న మంటపై అరగంటపాటు మరిగించాలి. మరిగిన మిశ్రమాన్ని మరొక గిన్నెలో వడబోసి క్యారెట్ తురుము, ఉల్లికాడలు, తగినంత ఉప్పు వేసి మరి కాసేపు మరిగించాలి. చివరగా కొత్తిమీర, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే కొత్తిమీర సూప్ రెడీ.