శనివారం 06 జూన్ 2020
Hyderabad - May 20, 2020 , 00:52:27

తెలంగాణ ఆన్‌లైన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌-2020

తెలంగాణ ఆన్‌లైన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌-2020

హైదరాబాద్ : ఇంటర్నేషనల్‌ టెలి కమ్యూనికేషన్‌ డేను పురస్కరించుకొని ఈనెల 17 నుంచి 28వ తేదీ వరకు ‘తెలంగాణ ఆన్‌లైన్‌ థియేటర్‌ ఫెస్టివల్‌-2020’ని తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ థియేటర్‌ అండ్‌ మీడియా రిపర్‌ట్రాయ్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్నది. ఆన్‌లైన్‌ వేదికగా ప్రతి రోజూ సాయం త్రం7 గంటల నుంచి 8 గంటల వరకు నాటకాలను ప్రదర్శిస్తారు. తెలంగాణ థియేటర్‌ అండ్‌ మీడియా రిపర్‌ట్రాయ్‌, సీనియర్‌ ఆర్టిస్ట్‌ దొంతి జంగయ్యగౌడ్‌ ఆధ్వర్యంలో ఇవి కొనసాగనున్నాయి.

 ఆన్‌లైన్‌ లింక్‌ కోసం ‘వాట్సాప్‌ 9247140023’లో సంప్రదించవచ్చని నిర్వాహకులు చెప్పారు. మంగళవారం డాక్టర్‌ దాశరథి రంగాచార్య రచించిన ‘మోదుగు పూలు’ నాటకాన్ని ప్రదర్శించారు. 20, 21, 22వ తేదీల్లో గంగు నాటకాన్ని మూడు విభాగాలుగా, 23 నుంచి 26వ తేదీ వరకు తుగ్లక్‌ నాటకాన్ని నాలుగు పర్యాయాలుగా ప్రదర్శించనున్నారు. ఇంకా రోమన్‌ హాస్య నాటకం ‘దయ్యాల కొంప’ నాటకాన్ని పూర్తి స్థాయిలో ఈనెల 27వ తేదీన ప్రదర్శిస్తారు. 28న ‘శ్రీ కృష్ణరాయభారం’ నాటకం నుంచి ‘శయన దృశ్యం’ అనే పద్య నాటకాన్ని ప్రదర్శిస్తారు. 


logo