ఆదివారం 25 అక్టోబర్ 2020
Hyderabad - Aug 30, 2020 , 22:50:25

తెలంగాణ మాదిగ జేఏసీ అధికార ప్రతినిధిగా

తెలంగాణ మాదిగ జేఏసీ అధికార ప్రతినిధిగా

ఎర్రవెల్లి కృష్ణ మాదిగ నియామకం

బంజారాహిల్స్‌: తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా సీనియర్‌ నాయకుడు, తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఎర్రవెల్లి కృష్ణ మాదిగ నియమితులయ్యారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, మాదిగ జేఏసీ చైర్మన్‌ డా. పిడమర్తి రవి ఈ మేరకు కృష్ణ మాదిగకు నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో డా. పిడమర్తి రవితో ఉస్మానియా యూనివర్సిటీలో పాల్గొన్నారు. మాదిగ హక్కుల కోసం నిరంతరం పోరాడిన ఎర్రవెల్లి కృష్ణ ఇప్పటికే మాదిగ జేఏసీ గ్రేటర్‌ అధ్యక్షుడిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తన సేవలను గుర్తించి.. అధికార ప్రతినిధిగా నియమించిన డా.పిడమర్తి రవికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కృష్ణ పేర్కొన్నారు.


logo